Medical College | జల్లపల్లి ఫారంలో పశు వైద్య శిబిరం…
Medical College | జల్లపల్లి ఫారంలో పశు వైద్య శిబిరం…
Medical College | కోటగిరి,(పోతంగల్) ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని జల్లపల్లి ఫారంలో ఓ.వి.నర్సింహారావు పశు వైద్య కళాశాల కోరుట్ల,పశు వైద్య పశు సంవర్ధక శాఖ తెలంగాణ వారి లయన్స్ క్లబ్ 320 డి బోధన్ సేవ ఆధ్వర్యంలో ప్రత్యేక కళాశాల పశువైద్య బృందం ద్వారా వివిధ వైద్య నిపుణుల సమక్షంలో అనేక రకాల జబ్బులను ఆరోగ్య సమస్యలను చర్మ వ్యాధి పరీక్షలు గర్భకోశ నిపుణుల సమక్షంలో తొలి దశ గర్భ చూడి నిర్ధారణ ను అల్ట్రా సౌండ్ స్కానర్ ద్వారా నిర్ధారణ చేశారన్నారు.
ఆవులు,గేదెలు,గొర్రెలు,మేకల,కుక్కలకు నట్టల నివారణ మందులను త్రాగించడం జరిగినదన్నారు. ఈ కార్యక్రమంలో పీవి నరసింహారావు పశు వైద్యవిశ్వవిద్యాలయం కోరుట్ల, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్, గోపాల్, నారాయణ,స్థానిక సర్పంచ్ దస్తగిరి సామాజిక సమయసేవ కార్యకర్త డాక్టర్ యమ్ ఏ. హకిమ్, గోపాల మిత్ర నగేష్ తదితరులు ఉన్నారు.
