గాలివాన బీభత్సం నేలకొరిగిన చెట్లు

గాలివాన బీభత్సం నేలకొరిగిన చెట్లు

కుంటాల కల్లూరు ప్రధాన రహదారిపై గాలివాన బీభత్సానికి భారీగా పడిన చెట్లు

కుంటాల మే 09 ఆంధ్రప్రభ కుంటాల మండల వ్యాప్తంగా గ్రామాల్లో శనివారం గాలివాన బీభత్సవంతో ఆయ గ్రామాల్లోని రహదారులపై ఉన్న చెట్లు విరిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగాయి కుంటాల కల్లూర్ ప్రధాన రహదారి పై గల అంద కుర్ వెంకూర్ సమీపాల మధ్యలో చెట్లు భారీగా విరిగిపోవడంతో పెద్దపెద్ద వాహనాలకు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీంతో వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో కుంటాల ఎస్సై సి అశోక్ రాకపోకలకు అంతరాయం కలగకుండా చెట్లను తన సిబ్బందితో పాటు పలువురు సాయంతో చెట్లను తొలగించారు అంతేకాకుండా మండల వ్యాప్తంగా గ్రామాల్లోని రోడ్లపై చెట్లు విరిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది జోరు వాన మరోపక్క గాలివాన బీభత్సం సృష్టించడంతో రైతులు ఉక్కిరిబిక్కిరై ఉరుకుల పరుగులు తీశారు

Leave a Reply