నల్లమల ఘాట్ రోడ్ లో టిప్పర్ బోల్తా..
పచ్చర్ల సమీపంలో తృటిలో తప్పిన భారీ ప్రమాదం…
లోయలో పడ్డ టిప్పర్ …
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : నల్లమల్ల అడవిలో నంద్యాల గిద్దలూరు జాతీయ రహదారిలో మంగళవారం ఉదయం నల్లమల్ల ఘాటులో ప్రమాదవశాత్తు టిప్పర్ లోయలో పడింది. మార్కాపురం నుంచి నంద్యాలకి వస్తున్న గిద్దలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెంబర్ ఏపీ 40 జడ్ 0246 నెంబర్ గల బస్సుకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ డ్రైవరు ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి కల్వర్టును ఢీకొని లోయలో పడిపోయింది.
డ్రైవర్ కు, క్లీనర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ ఆర్టీసీ బస్సులోని 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరూ సురక్షితంగా బయటపడటం విశేషం. ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను విషాదంలో ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటం జరిగింది. వీరందరిని ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటనపై పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపటట్టినట్లు తెలిపారు.
