Pralay | రణ్‌వీర్‌ నుంచి మరో భారీ సినిమా..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: ధురంధర్‌ తరువాత బాలీవుడ్ రణ్‌వీర్‌ సింగ్‌ తిరుగులేని హీరోగా మారిపోయాడు. ఇప్పుడు వరుస సినిమాలతో రణవీర్‌ సింగ్‌ బిజీగా అయ్యాడు. ధురంధర్‌ తరువాత రణ్‌వీర్‌ చేయాబోయే సినిమాపైనే అందరి దృష్టి. ఆయన నటించనున్న కొత్త చిత్రం ‘ప్రళయ్’ పై ఆసక్తికరమైన అప్డేట్‌ ఒకటి బీ టౌన్‌ లో చక్కర్లు కొడుతుంది.

ఆగస్టులో సెట్స్‌పైకి ‘ప్రళయ్’?

వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘ప్రళయ్’ రెగ్యులర్ షూటింగ్‌ను ఆగష్టులో ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలి షెడ్యూల్‌ను దీపావళి నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్టుగా ఈ సినిమాను రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తొలి షెడ్యూల్ పూర్తయిన తర్వాత రణ్‌వీర్ కొంతకాలం షూటింగ్‌కు విరామం తీసుకునే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీపికా పదుకొణె రెండో సంతానానికి జన్మనివ్వనున్న నేపథ్యంలో కుటుంబంతో సమయం గడిపేందుకు ఆయన పెటర్నిటీ లీవ్ తీసుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ విరామం తర్వాత ‘ప్రళయ్’ మిగిలిన చిత్రీకరణను 2027లో కొనసాగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాను ట్రూ స్టోరీ ఫిల్మ్స్, మా కసమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. దర్శకుడు హన్సల్ మెహతా కుమారుడు జై మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు. . జై ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తుండగా, డిస్టోపియన్ ముంబై నేపథ్యంలో మనుషుల మనుగడ చుట్టూ ఈ కథ తిరుగుతుందని సమాచారం. అయితే షూటింగ్ షెడ్యూల్, నటీనటులు, సాంకేతిక బృందం సహా పూర్తి వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.