Manthani | గ్రామ ప్రజల ఆరోగ్యమే మా ధ్యేయం

Manthani | గ్రామ ప్రజల ఆరోగ్యమే మా ధ్యేయం

Manthani | మంథని, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజల ఆరోగ్యమే ముఖ్య ధ్యేయమని సూరయ్యపల్లి సర్పంచ్ ఆర్ల నాగరాజు పేర్కొన్నారు. శనివారం సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ ఆరెల్లి సుచిత వరుణ్, పాలకవర్గం సభ్యులతో కలిసి పల్లె దావఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు సహకరంతో గ్రామంలో పల్లె దావఖానను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. గ్రామంలోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండాలని వారు తెలిపారు.

గ్రామాన్ని సస్యశ్యామలంగా ఉంచేందుకు ప్రజలు పాలకవర్గానికి సహకరించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పంచాయితీ కార్యదర్శి జైపాల్, ఎమ్ ఎల్ హెచ్ పి శ్రావణి, ఏఎన్ఎం శ్వేత, ఆశా కార్యకర్తలు, మాజీ సర్పంచ్ ఆకుల కిరణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రేపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జంజర్ల మల్లేష్, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆరేళ్ళి కిరణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఆర్ల లింగయ్య, ఆర్ల జ్ఞాని, జంజర్ల గట్టయ్య, జంజర్ల రాజు, తాటి సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు చంద్రు విజయ్, ఎరుకల సురేష్, రావుల నాగేష్, సుదర్శన్, శివ కిషోర్, ప్రజలు, పాల్గొన్నారు.

Leave a Reply