టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం..
టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం..
- తరలిన మండల నాయకులు
బెజ్జంకి, ఆంధ్రప్రభ : టీపీసీసీ ఎస్సి సెల్ చైర్మన్ గా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్బంగా గురువారం భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు బెజ్జంకి మండలం నుండి హైదరాబాద్ కు బయలుదేరారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో హైదరాబాద్కు వెళ్లారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ బాధ్యతలు లభించడం పార్టీ కార్యకర్తలకు గర్వకారణమని తెలిపారు. కార్యక్రమంలో ఎ.ఎం.సి చైర్మన్ పులిక్రిష్ణ, మండల అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు దామోదర్, ఎ.ఎం.సి వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
