పెంచిన పెట్రో ధరలు తగ్గించాలి
వైసీపీ ఆధ్వర్యంలో నిరసన
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారంగా మారుతున్నాయని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు కృష్ణాజిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ధరలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వైసీపీ ఇన్చార్జ్ పేర్ని కిట్టు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఇటీవల పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, ఇంధన ధరలను తగ్గించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
