ఇందిరమ్మ రాజ్యంతోనే ఇంటింటా సౌభాగ్యం..

ఇందిరమ్మ రాజ్యంతోనే ఇంటింటా సౌభాగ్యం..
- రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా కేంద్రం నుండి మక్తల్ వరకు మధ్యలో రూ. 210 కోట్లతో నాలుగు లైన్ల రహదారి పనులు త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి వెల్లడించారు. ప్రజలకు 24 గంటలు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తాననిఅన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామానికి వెళ్లే రహదారిపైరూ.2 కోట్లతో చేపట్టే బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు చిన్నపొర్లలో ఇందిరమ్మ గృహప్రవేశం, ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రోసిడింగులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనుల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజల ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని ఇందిరమ్మ రాజ్యంతోనేఇంటింటాసౌభాగ్యం సాధ్యమన్నారు. రాష్ట్రంలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లుమంజూరుచేసి ఇందిరమ్మ కలలసహకారంకోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మల్లేపల్లి వద్ద రోడ్డు బ్రిడ్జి వంతెన 60 పైపులతో సాంకేతిక నైపుణ్యంతో నిర్మిస్తున్నామని వెల్లడించారు.
ఈ వర్షాకాలంలోపే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మేము ఫోటోల కోసం పబ్లిసిటీ కోసం చేయడం లేదని ఇది మా బాధ్యత అన్నారు. ప్రతి గ్రామానికి రేషన్ దుకాణం అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికేదక్కిందన్నారు. ఎన్నికలప్పుడే పనిచేసే పరిస్థితి ఒకప్పుడు ఉండేదని నేడు నిరంతరం ప్రజల మధ్య ఉండి మక్తల్ నియోజకవర్గ ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో ఉంటున్నాననిస్పష్టంచేశారు. ఊట్కూర్ మండలంలోని అవుసలోనిపల్లి, మొగ్దుమ్ పూర్ రెండు గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా ఫైల్ తయారు చేయాలని కలెక్టర్ ను ఆదేశించినట్లు తెలిపారు.
నారాయణపేట – మక్తల్ నాలుగు లైన్ల రహదారి ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందనిఅన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. చిన్న పొర్ల, పెద్దపోర్ల, గ్రామాల మధ్యలో 40 పైపులతో వంతెన నిర్మిస్తున్నట్లువెల్లడించారు. ప్రతి పల్లెకు బీటి రోడ్డు సౌకర్యం కల్పించడంతోపాటు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధనలు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని అన్నారు.
గూడు లేని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు గృహప్రవేశాలకు వెళ్తుండడంతో వారి కళ్ళల్లో ఆనందం చూస్తున్నామనిఅన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టణాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందనిఅన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫణిందర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి శంకర్, తాసిల్దార్ చింతా రవి, ఎంపీడీవో కిషోర్ కుమార్, ఏవో గణేష్ రెడ్డి,గృహ నిర్మాణ శాఖ ఏఈ ప్రేమ,సర్పంచ్ లు కథలప్ప, నికిత ప్రశాంత్, బస్వారాజ్, జయప్రకాశ్ రెడ్డి, సత్యారెడ్డి, డి ఈ కళ్యాణ్ రెడ్డి, ఏ ఈ అజయ్ రెడ్డి, చిన్న పొర్ల మాజీ సర్పంచ్ మాలిపటేల్ రవీందర్ రెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు యగ్నేశ్వర్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేష్ రెడ్డి, ఉప సర్పంచ్ రాజు నాయకులు ధర్మరాజు వెంకటేష్,మాషప్ప తదితరులు పాల్గొన్నారు.
