2027 Telugu cinema | ప్లాన్ అదిరింది..

2027 Telugu cinema | ప్లాన్ అదిరింది..

2027 Telugu cinema | 2027 మార్చి 5న స్పిరిట్ రిలీజ్
రాజమౌళి-మహేష్ బాబు మూవీ ఏప్రిల్ 7న
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ జూన్ 11న రాబోతోంది
2027 సమ్మర్‌లో స్టార్ హీరోల భారీ పోటీ

2027 Telugu cinema | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : 2026లో సమ్మర్ సీజన్ ను టాలీవుడ్ క్యాష్ చేసుకోలేకపో్యింది. పెద్ది సినిమా తప్పితే.. చెప్పుకోదగ్గ సినిమాలు సమ్మర్ లో రావడం లేదు. చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు.. వస్తున్నప్పటికీ.. జనాలను థియేటర్స్ లోకి రప్పించలేకపోతున్నాయి. అయితే.. 2027 సమ్మర్ మాత్రం మామూలుగా ఉండదు. ఓ రేంజ్ లో ఉండబోతుంది. సినీ అభిమానులకు పండగే అని చెప్పచ్చు. ఇంతకీ.. 2027లో వస్తున్న క్రేజీ సినిమాలు ఏంటి..?

2027 Telugu cinema | 2027 మార్చి 5న స్పిరిట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో రూపొందుతోన్న మూవీ స్పిరిట్. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి రావాలి కానీ.. ప్రభాస్ వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం వలన ఆలస్యం అయ్యింది. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించబోతున్నాడు. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ సినిమాకి సంబందించిన వాయిస్ వీడియో రిలీజ్ చేస్తే.. ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని నెక్ట్స్ ఇయర్ మార్చి 5న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.

2027 Telugu cinema

2027 Telugu cinema | 2027 ఏప్రిల్ 7న వారణాసి..

ఇక దర్శకధీరుడు రాజమౌళి వారణాసి సినిమాను నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. రాజమౌళి సినిమాలు పోస్ట్ పోన్ అవుతుంటాయి కానీ.. ఈసారి మాత్రం ఎలాంటి పోస్ట్ పోన్ లు లేకుండా పక్కాగా అనౌన్స్ చేసిన డేట్ కే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకనే పక్కా ప్లాన్ తో షూటింగ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబో కోసం దశాబ్ధ కాలంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి సెట్ అయ్యింది. క్రేజీ పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది.

2027 Telugu cinema

2027 Telugu cinema | 2027 జూన్ 11న డ్రాగన్..

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో నటిస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఈ ఇయర్ లో జనవరి 9న రిలీజ్ చేయాలి కానీ కుదరలేదు. ఆతర్వాత జూన్ 25న రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పుడు నెక్ట్స్ ఇయర్ జూన్ 11న రిలీజ్ చేస్తామని.. ప్రకటించారు. నెక్ట్స్ మంత్ 20న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తామన్నారు. వార్ 2 సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. ఈసారి పక్కాగా బ్లాక్ బస్టర్ సాధించాలని ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తపిస్తున్నారు. మరో వైపు బన్నీ రాకా కూడా డేట్ అనౌన్స్ చేయలేదు కానీ.. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో రానుందని టాక్. ఇలా స్టార్ హీరోల క్రేజీ సినిమాలు నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో వస్తుండడం ఆసక్తిగా మారింది. మరి.. ఏ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి సరికొత్త రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

2027 Telugu cinema
2027 Telugu cinema

Leave a Reply