వర్షంకోసంజలాభిషేకాలు, సప్తహభజనలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : వానాకాలం సాగు చేసిన వివిధ పంటలకు వరుణదేవుడు కరుణించకపోవడంతో పంటలు ఎండు ముఖం పట్టడంతో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో వరుణ దేవుడి దేవుడి కరుణ కోసం దేవాలయాల్లో జలాభిషేకాలు, సప్తహ భజనలు చేస్తున్నారు. ఊట్కూర్ బీరప్ప దేవాలయంలో వర్షం కోసం సప్తహ భజన ఆదివారం చేపట్టగా బిజ్వార్ రైతులు వర్షం కోసం కృష్ణానది జలాలతో పడమటి ఆంజనేయ స్వామి కి జలాభిషేకం వర్షాలు పడి పంటలు మంచిగా పండాలని,భూగర్భ జలాలు పెరిగి బోరు బావులలో నీరు సమృద్ధిగా రావాలనిబిజ్వార్ గ్రామస్థులు కృష్ణ మండల కేంద్రము సమీపంలోని కృష్ణానది నీళ్ళు భజనలు చేసుకుంటూ తీసుకొని వచ్చి బిజ్వార్ శ్రీశ్రీశ్రీ పడమటి ఆంజనేయ స్వామి కి ఆదివారంజలాభిషేకంచేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం చేసి వర్షాలు బాగా పడాలని ప్రార్థించారు. ఈ సంవత్సరం వర్షాలు లేక అన్ని పంటల మొలకలు ఎండిపోతున్నాయి కావున వాన దేవుడు కరుణించి వర్షాలు కురుపించలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పూజారులు నర్సింహా చారి, వేణుగోపాల చారి , గ్రామస్థులు హెచ్. నర్సింహా, వెంకప్ప గౌడ్, ఉప్పు ఆంజనేయులు, సుధాకర్ రెడ్డి, మహేష్ గౌడ్, వాకిటి శివ కుమార్, సి.అశోక్ ,యన్.తిరుపతి, చిన్న నర్సింహా, యం. ఆంజనేయులు, తాయప్ప, మాల హన్మంతు ,కిష్టప్ప, ఉప్పు ఆంజనేయులు, యల్ . చిన్న రాజు,హన్మి రెడ్డి, తులిసి దాస్, సీతా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.