మహానాడుతో మమేకమవుతున్న టీడీపీ శ్రేణులు..

మహానాడుతో మమేకమవుతున్న టీడీపీ శ్రేణులు..

పాయకాపురం, ఆంధ్రప్రభ: తెలుగు శ్రేణుల జోష్‌కు మహానాడు వేదికగా మారింది. సింగ్‌నగర్‌లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో స్థానిక 64, 59వ డివిజన్ల ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం టీడీపీ శ్రేణులు కే. రవికుమార్, బంగారు నాయుడు, సతీష్, ఇతర నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని, అభివృద్ధి, సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన కొనసాగుతోందన్నారు.

టీడీపీ ఉపాధ్యక్షుడు, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నియోజకవర్గ అభివృద్ధినే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ అబ్జర్వర్ శ్రీను, డివిజన్ అధ్యక్షులు కే. రవికుమార్, రాజానా బంగారు నాయుడు, క్లస్టర్ ఇన్‌చార్జి వింజమూరి సతీష్, మరకా శ్రీను, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్, ఎస్‌కే బాబు, నందేటి ప్రేమ్, బొడ్డు కిషోర్, అబ్రాహాం, కోమరి రాజేష్ పాల్గొన్నారు.

Leave a Reply