Machilipatnam | జడ్పీ సమావేశం..

Machilipatnam | జడ్పీ సమావేశం..

Machilipatnam, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయము 10.00 గంటలకు మచిలీపట్టణం జిల్లా ప్రజా పరిషత్ కన్వెన్షన్ హాలులో ఉప్పాల హారిక, చైర్ పర్సన్ వారి అధ్యక్షతన జరగనుందని జడ్పీ సీఈఓ కన్నమ నాయుడు తెలిపారు. కావున జిల్లా ప్రజా పరిషత్ గౌరవ సభ్యులు, జిల్లా ప్రజా పరిషత్ శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు, కృష్ణా, ఎన్.టి.ఆర్, ఏలూరు (Eluru) జిల్లాల సంబంధిత అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరు కావలసినదిగా కోరారు. జిల్లా సమగ్ర అభివృద్ధి పై చర్చించడంతో పాటు పలు అభివృద్ధి పనుల గురించి తెలియచేయనున్నారు. అలాగే సమస్యల పరిష్కారం పై కూడా చర్చించనున్నారు.

Leave a Reply