కాన్షీరాం ఆశయ సాధనకు కృషి చేద్దాం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాం ఆశయ సాధనకు కృషి చేద్దామని ఊట్కూర్ మండల బీఎస్పీ ఇన్చార్జి కొక్కు గౌతమ్ పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాన్షీరాం 92వ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1934 మార్చి 15న కాన్షీరాం పంజాబ్లోని రూప్ నగర్ లో జన్మించి డిఆర్ డిఓలో ఉద్యోగం చేశారని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆలోచనతో ప్రభావితమై ఉద్యోగానికి రాజీనామా చేసి బహుజనులలో ఏకం చేసేందుకు 1984లో బీఎస్పీ పార్టీ స్థాపించి ఉత్తరప్రదేశ్,లో నాలుగు సార్లు అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు.

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అణగారిన వర్గాల కోసం బీఎస్పీ కృషి చేస్తుందన్నారు. కాన్సిరాం ఆశయాలను కొనసాగిస్తూ బహుజనుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి మాజీ అధ్యక్షురాలు కొక్కురోసినమ్మ, నాయకులు వెంకటేష్ శ్రీనివాస్ అశోక్ తరుణ్ ఆర్యన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.