Grain| వదంతులు నమ్మవద్దు..

Grain| వదంతులు నమ్మవద్దు..


రైతులకు స్పష్టం చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

Grain| మోపిదేవి, ఆంధ్రప్రభ : బీపీటీ ధాన్యం కొనట్లేదనే వదంతులు నమ్మవద్దని, నియోజకవర్గంలో ఇప్పటికి 513 మెట్రిక్ టన్నుల బీపీటీ ధాన్యం కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం మోపిదేవి మండలం రావివారిపాలెం, వెంకటాపురం, పెద్దకళ్లేపల్లి గ్రామాల్లో రైతులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కలిశారు. రావివారిపాలెంలో రైస్ మిల్లు (Rice mill) సందర్శించి, అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు గురించి వారితో మాట్లాడారు. బీపీటీ బియ్యం సక్రమంగా కొనుగోలు చేస్తున్నట్లు రైతులు, మిల్లర్ తెలిపారు. మిల్లులో డ్రయ్యర్ల సౌకర్యం, ముఠా సౌకర్యం పరిశీలించిన ఎమ్మెల్యే రైతులకు మేలు చేసేలా సాధ్యమైనంత వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లరుకు సూచించారు. వెంకటాపురంలో రైతు సేవా కేంద్రం వద్ధ సిబ్బంది, రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పరిశీలించారు. రైతన్నా మీకోసం కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం పెద్దకళ్లేపల్లి దేవస్థానం వద్ధ ధాన్యం ఆరబెట్టుకుంటున్న రైతులతో మాట్లాడి బీపీటీ బియ్యం కొనుగోలు అంశంలో వారి అపోహలు తొలగించి సందేహాలు నివృత్తి చేశారు.

వీఆర్ఓ గ్రామంలో బీపీటీ ధాన్యం ఎంతమంది రైతుల దగ్గర ఉందనే జాబితా తయారు చేయాలని, వారందరి దగ్గర బీపీటీ ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి జాబితా తయారు చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బందికి సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేని గ్రామాల్లో ఉన్న గ్రామ సచివాలయాల సిబ్బందిని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 1,04,064 మెట్రిక్ టన్నులు ధాన్యం (grain) కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటికే 1,037 మంది రైతుల నుంచి రూ.16.89 కోట్లు విలువైన 7,468 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.16.81 కోట్లు జమ చేసినట్లు వివరించారు. ఇందులో బీపీటీ ధాన్యం రూ.కోటి 23 లక్షలు విలువ కలిగిన 513 మెట్రిక్ టన్నుల ధాన్యం నియోజకవర్గంలో కొనుగోలు చేసినట్లు వివరించారు. జిల్లాలో రూ.5.80 కోట్లు విలువ కలిగిన 2,500 మెట్రిక్ టన్నుల బీపీటీ ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. బీపీటీ ధాన్యం గురించి ఎలాంటి వదంతులు రైతులు నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.హరనాధ్, ఏవో హెప్సిబా రాణి, పీఏసీఎస్ చైర్మన్లు పరుచూరి శ్రీనివాసరావు, అరజా రాధిక, సర్పంచ్ తుమ్మా సోములమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply