నిడుగుర్తిలో మైనార్టీలకు రంజాన్ తోఫా పంపిణీ..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనినిడుగుర్తి మజీద్ వద్ద పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం మంజూరు చేసిన రంజాన్ తోఫా సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ సంతోష్, మాజీ ఎంపిటిసి కృష్ణార్జున రెడ్డి శుక్రవారం మైనార్టీ సోదరులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పండగలు అందరూ సమానంగా జరుపుకోవాలనే లక్ష్యంతో ధనిక పేద తారతమ్య భేదాలు లేకుండా అందరూ సమానంగా జరుపుకునేందుకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తుందని అన్నారు.
మైనార్టీ సోదరులు నెల రోజులపాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపడుతారని రంజాన్ పండగ భక్తి భావనకు నిదర్శనమని పండుగ శాంతియుత వాతావరణం లో ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ మహమూద్, నాయకులు నారాయణరెడ్డి, రాజు గౌడ్ మైనార్టీలు తదితరులు పాల్గొన్నారు.
