Krishna District | కానూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ

  • జెండా దిమ్మె ధ్వంసంతో ఉద్రిక్త పరిస్థితులు
  • టీడీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు

Krishna District | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా కానూరులో దశాబ్దాలుగా ఉన్న టీడీపీ జెండా దిమ్మె ధ్వంసం కావడంతో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నాయకుల ఆరోపణల ప్రకారం, ఈ ఘటనకు వైసీపీ శ్రేణులు పాల్పడ్డారని తెలిపారు. అయితే, ఈ ఆరోపణలపై వైసీపీ నుంచి స్పందన రావాల్సి ఉంది.

సమాచారం అందుకున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తన అనుచరులతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ధ్వంసమైన జెండా దిమ్మె స్థానంలో కొత్త దిమ్మెను ఏర్పాటు చేసి పార్టీ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని టీడీపీ శ్రేణులను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనాస్థలంలో అదనపు పోలీసు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.