కొయ్యలగూడెంలో ఉచిత వైద్య శిబిరం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం గ్రామంలో పద్మజ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వనస్థలిపురంలోని ప్రగ్మా హాస్పిటల్స్‌ వైద్య బృందం సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరంలో గ్రామస్తులకు ఉచితంగా షుగర్‌, బీపీ, రక్త పరీక్షలతో పాటు ఈసీజీ, 2డీ ఈకో పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను ఉచితంగా అందించడంపై పద్మజ్యోతి యువజన సంఘం ప్రతినిధులను పలువురు అభినందించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బడుగు కైలాసం, కార్యవర్గ సభ్యులు వెంకటేశం, రాజు, సురేందర్‌, రాఘవేంద్ర, ఆనంద్‌, శ్రీను, శేఖర్‌, గిరీష్‌, పాండు, సతీష్‌, సంతోష్‌, శ్రీనాథ్‌, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.