KoreanKanakaraju | వరుణ్‌ తేజ్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌: వరుణ్‌ తేజ్ కొత్త మూవీ ‘కొరియన్ కనకరాజు’ సినిమాపై మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని 2027 ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్‌తో పాటు ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ’ (Entertainment Guaranteed) అనే క్యాప్షన్ ఉన్న పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా కొరియా-ఇండియా కలయికలో హారర్ కామెడీ చిత్రంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో #KoreanKanakaraju, #KOKA హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

వరుస ఫ్లాపులతో ఉన్న వరుణ్‌ తేజ్‌కు ఈ సినిమాతో విజయం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోస్టర్‌లో వరుణ్ తేజ్ మాస్ లుక్‌లో.. లుంగీ కట్టుకుని, కుర్చీలో కూర్చొని కత్తి పట్టుకున్న విధానం అదిరిపోయింది. ఇప్పటికే విడుదలైన సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా రితికా నాయక్ నటిస్తుండగా.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఒక్క పోస్టర్‌తోనే ‘కొరియన్ కనకరాజు’ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.