1stwicket | రెచ్చిపోతున్న ట్రావిస్ హెడ్
1stwicket | రెచ్చిపోతున్న ట్రావిస్ హెడ్
1stwicket | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్లో ఈరోజు మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా హెడ్, అభిషేక్ దిగారు. 44 పరుగుల వద్ద హైదరాబాద్ జట్టు ఫస్ట్ వికెట్ కోల్పోయింది. అభిషేక్‌శర్మ పది బంతుల్లో 15 పరుగులు చేసి కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్యాచ్‌ను గ్రీన్ పట్టేశాడు. ఫస్ట్ డౌన్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. మరో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ రెచ్చిపోతున్నాడు. బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఫోర్లు సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. పవర్‌ప్లేలో హైదరాబాద్ జట్టు ఒక వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది.
