Koratala | ఒకేసారి రెండు సినిమాలు..

Koratala | ఒకేసారి రెండు సినిమాలు..
Koratala | దేవర 2పై అనిశ్చితి.. హీరోల డేట్స్ సమస్య
దర్శకత్వం నుంచి నిర్మాణం వైపు కొరటాల మలుపు
విశ్వక్ సేన్‌తో కొత్త సినిమా ప్రారంభం
అజయ్ భూపతితో మంగళవారం 2 ప్రణాళిక
టాలీవుడ్‌లో పెరుగుతున్న ఆసక్తి
Koratala | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కొరటాల శివ.. బ్లాక్ బస్టర్ మూవీస్ అందించారు. దేవర 2 తెరకెక్కించాలని తపిస్తున్నారు. అయితే.. ఎన్టీఆర్ వేరే ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. మరో వైపు ఏ హీరో కూడా ఖాళీగా లేరు. ఒకటి, రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందుకనే.. కొరటాల రూటు మార్చారు. దర్శకత్వం వైపు నుంచి నిర్మాణం వైపు ఫోకస్ పెట్టారు. వరుసగా సినిమాలు (Movies) నిర్మించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. రెండు సినిమాలను ఒకేసారి నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. కొరటాల నిర్మిస్తున్న ఆ రెండు సినిమాలు ఏంటి..? అసలు కొరటాల ప్లాన్ ఏంటి..?
Koratala | దేవర 2 ఎప్పుడు..?
మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్, దేవర.. ఇలా బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన కొరటాల శివ.. ఇప్పుడు సినిమా చేద్దామంటే.. హీరోలు దొరకడం లేదు. ఎన్టీఆర్(NTR) .. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న డ్రాగన్ మూవీ షూట్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో క్లారిటీ లేదు. దీంతో దేవర 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కొరటాలకు కూడా క్లారిటీ లేదు. ఈ గ్యాప్ లో ఓ సినిమా చేయాలని కొరటాల చాలా ట్రై చేశారు. బాలయ్య, పవన్ కళ్యాణ్, నాగచైతన్య.. ఇలా సీనియర్ హీరోలు, యంగ్ హీరోలను ట్రై చేశారు కానీ.. ఎవరితోనూ సెట్ కాలేదు.

Koratala | కొరటాల నిర్మాణంలో విశ్వక్ సినిమా
ఇక లాభం లేదనుకుని.. నిర్మాణం వైపు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన ఒకేసారి రెండు సినిమాలను నిర్మించే పనిలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ప్రాజెక్టులు కొత్త కథలు, (Story) కొత్త ప్రతిభకు అవకాశం కల్పించేలా ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఒకటి విశ్వక్ సేన్ హీరోగా కొరటాల శివ నిర్మాణంలో ఓ సినిమా. ఇది ఇటీవల స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాని కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై కొరటాల ఈ సినిమాలను నిర్మిస్తున్నారు.

Koratala | కొరటాల నిర్మాణంలో.. మంగళవారం 2
ఇక రెండో సినిమా ఏంటంటే.. అజయ్ భూపతితో నిర్మించనున్నారని తెలిసింది. అజయ్ భూపతి.. మంగళవారం అనే సినిమాను తెరకెక్కించడం.. ఆ సినిమా సక్సెస్ అవ్వడం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ తీయాలి అనుకుంటున్నారట. ఇటీవల అజయ్.. కొరటాలకు కథ చెప్పడం.. ఆ కథకు కొరటాల (Koratala) ఓకే చెప్పడం జరిగిందట. అడ్వాన్స్ కూడా ఇచ్చారట. ప్రస్తుతం అజయ్ భూపతి.. శ్రీనివాస మంగాపురం అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల నిర్మాణంలో.. అజయ్ భూపతి మంగళవారం 2 పట్టాలెక్కనుంది అని తెలిసింది. మొత్తానికి, దర్శకత్వంతో పాటు నిర్మాణంలోకి అడుగుపెట్టిన కొరటాల శివ ఇక పై ఎలాంటి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తారు అనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.

