Shivani-Death-Investigation : బతకాలని ఉంది Andhra Prabha Top News
Shivani-Death-Investigation : బతకాలని ఉంది Andhra Prabha Top News
- కానీ భయమేస్తోంది
- చాలా గిల్టీగా ఉంది ..
- ఇది శివానీ సూసైడ్ నోట్ క్లూ ,
- దర్యాప్తులో పోలీసులు బిజీబిజీ
( ఆంధ్రప్రభ; ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)

అప్ కమింగ్ షైనింగ్ స్టార్.. శివానీ ఆత్మహత్య అసలు కారణమేంటీ? చదువులో రాణిస్తోంది. పదవ తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభను కనపర్చి షైనింగ్ స్టార్ గా అవార్డు అందుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకే హామీ ఇచ్చిన ఈ చలాకీ శివానీ ఆత్మవిశ్వాసంలో ఢోకాలేదు. అని అందరూ భావించారు. ఈ మాట ఇచ్చిన మూడు రోజు వ్యవధిలోనే ఆమె ఉరి తాడుకు వేలాడుతూ కనించే సరికి సభ్య సమాజం కన్నీళ్తు ఆగలేదు. ఆమె రాసిన ఆఖరిలేఖలోని అంశాలు..కుటుంబంతో అనుబంధం.. తన జీవిత లక్ష్యం స్పష్టంగా కనిపించాయి. కానీ తన ఆత్మహత్యకు బలమైన కారణం అంచనాలకు దొరకలేదు. గిల్టీగా ఉంది. బతకాలని ఉంది. కానీ భయంగా భయంగా ఉంది? ఈ బాధను ఒక్కదాన్నే మోయలేక పోతున్నా.. అంటూ.. ఆమె సూసైడ్ నోట్‌లో స్పష్టం చేసింది. ఈ పదాలే అనేక పశ్నలకు తావిచ్చాయి. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని ధ్వంసం చేసిన అంశం ఏమిటీ? చదువులో ఎక్కడ తగ్గటం లేదు. కుటుంబ సభ్యులతో గొడవ లేదు. మరి ఎ కష్టం ఆమెను బలహీన పర్చింది?
Shivani-Death-Investigation : బతకాలని ఉంది.. కానీ
శినానీ .. రాసిన సూసైడ్ నోట్ లోని అంశాలు ఇలా ఉన్నాయి.
అమ్మా చాలా సారీ అమ్మా నీకోసం చాలా కష్టపడుతున్నాను డాడీ నీ డ్రీమ్ నెరవేర్చాలనే ప్రయత్నం చేస్తున్నాను డాడీ, అమ్మా నాకు బ్రతకాలనే ఉంది కానీ బ్రతకడానికి చాలా భయంగా ఉంది చాలా గిల్టీగా ఉంది అమ్మా నీ కోసం నేనేం చేయలేకపోయాను డాడీ నేను నాకు ఏదైనా సాధించి చూపించాలని ఉంది కానీ నేను ఇంతకు మించి తట్టుకోలేకపోతున్నాను. నాతో ఈ బాధ ఒక్కదాన్నే మోయడం కావట్లేదు నేను చనిపోయాక నా పై ఎవ్వరూ కోప్పడకండి డాడి మీరు ఎప్పుడూ లవ్ చేస్తూనే ఉండండి బై అమ్మమ్మ, అన్నయ్య జాగ్రత్త డాడి మాట విను చెడ్డ పనులు చేయకు. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ మీరు ఎప్పటికైనా కలవండి ద్వేషించుకోకండి సారీ,, ఘటన స్థిలిలో దొరికిన ఈ లేఖ ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొసాగుతోంది.
Shivani-Death-Investigation : రంపచోడవరంలో విషాదం

పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఇర్లపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఈ సమాచారంతో యావత్తు ఆంధ్రాప్రజానీకం విషాదంలో మునిగిపోయింది. ఇక సీఎం చంద్రబాబు చలించిపోయారు. ఆమె బలవన్మరణాన్ని తట్టుకోలేక పోయారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. మూడు రోజుల కిందటే రంపచోడవరం జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగిన సీఎం చంద్రబాబు నాయుడు తల్లికి వందనం కార్యక్రమంలో చురుగ్గా కనిపించింది. సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి భోజనం చేసింది. చంద్రబాబు నాయుడుతో షైనింగ్ స్టార్ అవుతానని ,అవార్డును సీఎం చేతులతోనే తీసుకుంటాను అంటూ సీఎంకు శివాని హామీ ఇచ్చింది. విద్యార్థిని మాటలకు పరవశించిన చంద్రబాబు నాయుడు సెల్ఫీ దిగి రాబోయే రోజుల్లో తనకు రిపోర్ట్ చేయాలంటూ విద్యార్థినితో సీఎం తెలిపినట్లు సమాచారం ..చురుగ్గా ఉన్న విద్యార్థిని శివాని ఒక్కసారిగా ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఘటనా స్థలానికి రంపచోడవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Shivani-Death-Investigation : చలించిన సీఎం
పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని తనువు చాలించడం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించింది. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని నాతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరం. కారణాలు ఏవైనా తన కలలు నిజం కాకుండానే ఆ విద్యార్ధిని దూరమవ్వడం నన్ను కలిచివేస్తోంది. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించాను.
ఎన్ని కష్టాలొచ్చినా…
సమస్యలు, కష్టాలు వచ్చినా విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలి. ఎవ్వరూ ఒత్తిడికి, నిరాశ, నిస్పృహలకులోను కావొద్దని కోరుతున్నాను. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. మీ బాధను, ఆవేదనను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఆత్మీయులతో పంచుకోండి. ఒత్తిడిని, అధిగమించి మీ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగండి. ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం అని సీఎం భరోసా ఇచ్చారు. .
