Komaram Bheem | ఘ‌న స‌న్మానం…

Komaram Bheem | ఘ‌న స‌న్మానం…

Komaram Bheem | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్(Komaram Bheem) ఆసిఫాబాద్ జిల్లా నూతన డీసీసీ అధ్యక్షురాలుగా నియామకమైన ఆత్రం సుగుణక్క బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఈ రోజు మండల కేంద్రంలోకి రావడంతో పార్టీ కార్యాలయంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుమేతవిశ్వనాత్ రావు(Kudumethaviswanath Rao), కాంగ్రెస్ యువ నాయకులు మెస్రం అంబాజీరావు, నాయకులు ఆమెకు పూలమాలలు వేసి శాలువలతో ఘన సన్మానం చేశారు.

ముందుగా పెద్ద సంఖ్యలో నాయకులు బైక్ ర్యాలీ(Bike rally) ద్వారా జంగం ఘాటు ప్రాంతానికి వెళ్లి నూతన డీసీసీ అధ్యక్షురాలుకు ఘన సన్మానం చేశారు. ఆత్రం సుగుణక్క జంగాం ఘాట్(Jangam Ghat)లోని హనుమాన్ మందిర్, జంగాం రావుజి గూడ హనుమాన్ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ముకిద్, మండల ఉపాధ్యక్షుడు పేందూరు ప్రకాష్(Pendur Prakash), జైనూర్ మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ యువ జిల్లా నాయకుడు మెస్రం అంబాజీరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.