Kharge Revanth Meeting | శంషాబాద్ నోవాటెల్‌లో భేటీ

Kharge Revanth Meeting | శంషాబాద్ నోవాటెల్‌లో భేటీ

Kharge Revanth Meeting | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. హైదరాబాద్ మీదుగా గుల్బర్గా (కలబురగి)కు బయలుదేరుతున్న ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

అనంత‌రం శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో మల్లికార్జున్ ఖర్గే ( AICC President Mallikarjun Kharge ), రేవంత్ రెడ్డి ( Revanth Reddy )మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నేతల మధ్య రాష్ట్ర రాజకీయ పరిస్థితులు,పార్టీ వ్యవహారాలు,ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణలో రాజకీయాలు, పార్టీ పరిస్థితి, ఎస్ఐఆర్ సహా పలు కీలక అంశాలపై చర్చించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్ఐఆర్‌ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంపై నేతలంతా చర్చించినట్లు సమాచారం. దీనికితోడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలు, బడ్జెట్ ప్రతిపాదనలను సీఎం రేవంత్‌రెడ్డి.. అధినేతకు వివరించినట్టు తెలుస్తోంది.

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply