MLA | కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం…

MLA | కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం…

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్


MLA | జన్నారం, ఆంధ్రప్రభ : మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే (MLA) వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ రైతు వేదికలో శనివారం సాయంత్రం మహిళలకు చీరలను ఆయన పంపిణీ చేశారు.

సెర్ప్ (serp) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే పల్లెలు అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సెర్ప్ ఏపీఎం లలిత కుమారి, జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ,ఫసిహుల్ల, తదితరులు పాల్గొన్నారు.