ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి జూలై 30న వాక్-ఇన్ ఇంటర్వ్యూ

డిప్లొమా లేదా బి.ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం

ఖమ్మం, ఆంధ్రప్రభ: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఖమ్మంలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి జూలై 30న వాక్-ఇన్ ఇంటర్వ్యూను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ తెలిపారు.

బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మెడికల్ సూపరింటెండెంట్ ఛాంబర్‌లో ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.