హైదరాబాద్‌లో ప్రభుత్వ విప్‌కు శుభాకాంక్షలు..

చిట్యాల, ఆంధ్రప్రభ : శాసనమండలిలో ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్ సోమవారం హైదరాబాద్‌లోని ఆయన ప్రభుత్వ విప్ కార్యాలయం (పేషీ) ప్రారంభోత్సవం సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వేముల వీరేశంకు శాలువా కప్పి, పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ విప్‌గా వేముల వీరేశం సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన నాయకత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.