bandla ganesh | మంత్రి గారూ.. పెళ్లికి రండి
మంత్రి దామోదరను ఆహ్వానించిన బండ్ల గణేష్
కుమార్తె జనని వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన నటుడు, నిర్మాత
వధూవరులకు మంత్రి శుభాకాంక్షలు.. సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్ష
bandla ganesh | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమార్తె జనని వివాహానికి హాజరుకావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు. ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ బండ్ల గణేష్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. వధూవరులు ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కూడిన వైవాహిక జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ తన ఆశీర్వాదాలను అందించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మంత్రి దామోదర్ రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు.
