హైమాస్ట్ లైట్లు మంజూరు చేయాలని ఎంపీకి వినతి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి రెండు హైమాస్ట్ లైట్లు మంజూరు చేయాలని పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణకు తిమ్మారెడ్డిపల్లి తండా బూత్ అధ్యక్షుడు రాథోడ్ సంతోష్ నాయక్ సోమవారం వినతిపత్రం సమర్పించారు.
నారాయణపేట జిల్లాలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఎంపీ డీకే అరుణను కలిసి, తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో రెండు హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ వినతిపై సానుకూలంగా స్పందించి, తిమ్మారెడ్డిపల్లి తండాకు త్వరలో హైమాస్ట్ లైట్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు రాథోడ్ సంతోష్ నాయక్ తెలిపారు.
