కార్మికుల ఇబ్బందులు విని కవిత కంటతడి
కార్మికుల ఇబ్బందులు విని కవిత కంటతడి
కనీస సౌకర్యాలు కరువు
సింగరేణికి ప్రభుత్వమే విద్రోహి
కార్మికుల పక్షాన పోరాడుదాం
రామగుండం, ఆంధ్రప్రభ : కనీస సౌకర్యాలు కూడా అందడం లేదని బొగ్గు గని కార్మికులు టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఎదుట లబోదిబో అనడంతో ఒక్కసారిగా కవిత ఒక్కసారిగా చలించిపోయి కంటతడి పెట్టుకున్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు మైన్ ను సందర్శించి, కార్మికులతో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.ఒక కార్మికుడు తాను పడుతున్న ఇబ్బందులు చెప్తుంటే విని చలించి పోయిన కవిత తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ సింగరేణికి ప్రభుత్వమే విద్రోహిగా తయారైందన్నారు. 50 వేల కోట్లు బకాయి పెట్టటంతో సంస్థ ఆర్థికంగా ఇబ్బంది పడుతోందని, కార్మికులకు కనీసం చిన్న చిన్న సౌకర్యాలు కూడా కల్పించటం లేదన్నారు.హెచ్ఎంఎస్ ను గెలిపిస్తే మీరు కాలర్ ఎగిరేసుకునే చేస్తామన్నారూ.
20 ఏళ్లుగా ప్రజాజీవితంలోనే ఉన్నా

ఉద్యమంలో, ఆ తర్వాత ప్రభుత్వంలోనూ మనం కలిసి పనిచేశాం. కానీ ఇప్పుడు రకరకాల కారణాలతో పార్టీ పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకోసమే పనిచేస్తా. 20 ఏళ్లుగా చేస్తూనే ఉన్నా.ఇప్పుడు సింగరేణిలో చాలా మంది చదువుకున్న యువత పనిచేస్తోంది. వాళ్లంతా కూడా లేబర్ చట్టాల గురించి తెలుసుకోవాలి. దాని ద్వారా మన హక్కులను కాపాడుకోవచ్చు. ఇప్పటికీ కూడా సింగరేణలో బ్రిటీష్ సిస్టం నడుస్తోంది. కార్మికులను ఆఫీసర్లు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.
పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారు

కార్మికులను కలిసేందుకు వస్తామంటే పోలీసుల్ని పెట్టి మమ్మల్ని నాలుగు రోజులుగా అడ్డుకుంటున్నారు. అసలు సింగరేణిలోకి పోలీసులకు అనుమతే లేదు. అయిన సరే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. మేము ఏఎల్పీ మైన్స్ వస్తున్నామని తెలిసి మా గేట్ మీటింగ్ కు వెళ్తే జీతం కట్ చేస్తామని చెప్పారంట. కార్మికుల జీతం కట్ చేస్తే నేను ఇక్కడే ధర్నా చేస్తా.కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకునే హక్కు నాకు ఉంది. ఏ పార్టీ మీటింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకునే హక్కు కార్మికులకు ఉంది.
మంత్రి శ్రీధర్ బాబు మా జోలికి వస్తే మళ్ళీ ఓడిస్తాం
కొమురం భీమ్ విగ్రహా ఆవిష్కరణ సందర్భంగా నాతో పాటు కొమురం భీమ్ మనవడిని కూడా అరెస్ట్ చేయించారు. ఆయన చేసిన తప్పుకు మేము వెంటబడి మరీ ఓడించాం. మళ్లీ ఇప్పుడు కార్మికులకు మాకు మధ్య వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేస్తే ఊరుకోమని శ్రీధర్ బాబును హెచ్చరిస్తున్నా. మళ్లీ వెంటబడి ఓడిస్తామని చెబుతున్నా.
