విజయ బాటలో విజేత..

విజయ బాటలో విజేత..
- అక్కల అండగా ఉంటా ఆశీర్వదించండి
- ప్రజా సేవ కోసం మీ ముందుకు వస్తున్న
- ఏసీ గుర్తుకే ఓటెయ్యండి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటా
మంథని, ఆంధ్రప్రభ : మంథని మున్సిపల్ పరిధిలో ఏడవవార్డులో ఇనుముల విజేత సత్యనారాయణ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఏసీ గుర్తుకే ఓటేయాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆమె వివరించారు. గెలిచిన తర్వాత పాలకులుగా కాకుండా సేవకురాలిగా ప్రజాసేవ కోసం ప్రతిక్షణం పరితపిస్తానని ఆమె వివరించారు. అర్హులైన ప్రజలందరికీ కేంద్ర, రాష్ట్ర సంక్షేమ ప్రభుత్వాలు అందించడంలో ముందు ఉంటానని ఆమె తెలిపారు. ప్రతి ఇంటి ఆడబిడ్డగా సమస్య వస్తే పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆమె వివరించారు.
వార్డు ప్రజలందరూ ఏసీ గుర్తుకు ఓటెయ్యాలని, ఆశీర్వదించి అవకాశం కల్పిస్తే ఐదు సంవత్సరాలు సేవకురాలుగా సేవ చేస్తారని ఆమె వివరించారు. మోసపోవద్దని, అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రలోభాలకు లొంగకుండా ఆశీర్వదించాలని ఆమె తెలిపారు. గెలిచిన తర్వాత వార్డు సందర్శన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తానని ఆమె వివరించారు. ఆమె ప్రచార యాత్ర విజయత్ర తలపిస్తుందని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా ఇనుముల విజేత విజయం ఖాయమని పలువురు విశ్వాసము వ్యక్తం చేస్తున్నారు.
