బక్రీద్ ఏర్పాట్లపై క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ పరిశీలన

బక్రీద్ ఏర్పాట్లపై క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ పరిశీలన

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ గోడిసెల సంధ్యారాణి-రాజా రమేష్ ఈద్గా పరిసరాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం 1వ వార్డు తారక రామ కాలనీ డబుల్ బెడ్‌రూమ్ ఈద్గా ప్రాంతంలో ఆమె పర్యటించి, ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.

పండుగ రోజున ఈద్గా వద్దకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈద్గా, దర్గా పరిసరాల్లో చెత్త తొలగింపు, తాగునీటి సౌకర్యం, వీధి దీపాల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతకు మున్సిపాలిటీ అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

పండుగ రోజుల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పారిశుధ్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని చైర్‌పర్సన్ పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ కౌడగొని సంబయ్య, 6వ వార్డు కౌన్సిలర్ మద్దెల శంకర్, 14వ వార్డు కౌన్సిలర్ కొప్పి రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్, సానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ సంతోష్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply