july12sunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

july12sunday2026 ఉద్యోగం కోసం ఎదురు చూడాలా? లేక అవకాశాన్ని మనమే సృష్టించుకోవాలా?

ప్రపంచం మారింది… ఉద్యోగాల నిర్వచనమూ మారింది
ఏఐ యుగంలో యువత ఎదుర్కొంటున్న కొత్త సందిగ్ధత
ఉద్యోగం కాదు… అవకాశాన్ని సృష్టించే ఆలోచన
విజయానికి మొదటి ప్రశ్న… “నేను ఏం చేయగలను?”
ప్రతిభను నైపుణ్యంగా, నైపుణ్యాన్ని ఉపాధిగా మార్చుకోవడం ఎలా?
ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం చెప్పే అసలు సందేశం

july12sunday2026
july12sunday2026

july12sunday2026 ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా…

ఒకప్పుడు పెద్దలు పిల్లలకు ఒకే మాట చెప్పేవారు. “బాగా చదువు… మంచి ఉద్యోగం వస్తుంది… జీవితం స్థిరపడుతుంది.” ఆ సూత్రం అప్పట్లో పనిచేసింది. కానీ ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం ఖాయం అనే రోజులు క్రమంగా చరిత్రలో కలిసిపోతున్నాయి. మరోవైపు కృత్రిమ మేధస్సు (ఏఐ) అనే కొత్త శక్తి ప్రపంచ ఉద్యోగ వ్యవస్థనే తిరగరాస్తోంది. నిన్నటి వరకు మనుషులు చేసిన పనిని ఈరోజు యంత్రాలు చేస్తున్నాయి. అదే సమయంలో ఇంతవరకు లేని కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తున్నాయి.

ఈ మార్పుల మధ్య నిలబడ్డ యువత మనసులో ఒకటే సందేహం. ఏ కోర్సు చదవాలి? ఏ ఉద్యోగాన్ని ఎంచుకోవాలి? ఈరోజు ఉన్న ఉద్యోగం రేపు ఉంటుందా? నేను నేర్చుకుంటున్న నైపుణ్యానికి మరో ఐదేళ్ల తర్వాత కూడా విలువ ఉంటుందా? ఈ ప్రశ్నలకు ఒక్కరికి కాదు… ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యువత సమాధానం వెతుకుతోంది. అయోమయం, అనిశ్చితి మధ్య భవిష్యత్తు కోసం సరైన దారిని వెతుకుతోంది.

అయితే ఈ అయోమయం మధ్య మరో కొత్త ఆలోచన కూడా మొలకెత్తుతోంది. “ఉద్యోగం కోసం ఎదురు చూడడం కంటే… అవకాశాన్ని మనమే ఎందుకు సృష్టించకూడదు?” అనే ఆలోచన. స్టార్టప్‌లు, డిజిటల్ వ్యాపారాలు, ఫ్రీలాన్సింగ్, ఆన్‌లైన్ సేవలు, కంటెంట్ సృష్టి, స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త వ్యాపారాలు… యువత దృష్టి ఇప్పుడు ఈ దిశగా మళ్లుతోంది. ఎవరికీ తలవంచకుండా, తమ ప్రతిభను పెట్టుబడిగా మార్చుకుని, తమకు తామే యజమానులుగా ఎదగాలనే ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఇది కేవలం ఉపాధి మార్గం కాదు… ఒక విప్లవాత్మక ఆలోచనా విధానం.

కానీ ఇక్కడే చాలామంది చేసే పొరపాటు ఒకటి ఉంది. “ఏ వ్యాపారం ప్రారంభించాలి?” అనే ప్రశ్నను ముందుగా అడుగుతారు. నిజానికి దానికి ముందుగా అడగాల్సిన ప్రశ్న వేరేది.

“నేను నిజంగా ఏ పని బాగా చేయగలను?”

ప్రతి మనిషిలో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. కొందరు మాట్లాడగలరు. కొందరు బోధించగలరు. కొందరు సాంకేతిక పరిజ్ఞానంలో దిట్టలు. మరికొందరు చేతివృత్తుల్లో అద్భుతాలు సృష్టిస్తారు. ఇంకొందరు మార్కెటింగ్‌లో, డిజైన్‌లో, వ్యవసాయంలో, ఆహార తయారీలో లేదా కళల్లో అసాధారణ ప్రతిభ చూపుతారు. ముందుగా మన బలం ఏమిటో గుర్తించాలి. తర్వాత ఆ ప్రతిభకు మార్కెట్లో డిమాండ్ ఎంత ఉందో తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఆ ప్రతిభను ఉపాధిగా, వ్యాపారంగా, బ్రాండ్‌గా ఎలా మార్చుకోవాలన్న దానిపై ఆలోచించాలి.

ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం మనకు గుర్తు చేసే సందేశం కూడా ఇదే. విజయం అనేది కేవలం డిగ్రీతో రాదు… నైపుణ్యంతో వస్తుంది. ఉద్యోగాన్ని వెతికేవాడిగా కాకుండా, అవకాశాలను సృష్టించేవాడిగా మారడమే నేటి యువత ముందున్న అసలు సవాలు.

ఒక చిన్న విత్తనం నేలలో పడిన వెంటనే మహావృక్షం కాదు. దానికి సరైన నేల, నీరు, ఎండ, సమయం, సంరక్షణ అన్నీ అవసరం. అలాగే యువతలోని ప్రతిభ కూడా. దాన్ని గుర్తించాలి. మెరుగుపరచాలి. కాలానికి తగ్గ నైపుణ్యాలను జోడించాలి. వైఫల్యాలకు భయపడకుండా ముందుకు సాగాలి. ఎందుకంటే ప్రతి వైఫల్యం వెనుక ఒక కొత్త అవకాశం దాగి ఉంటుంది.

విజయానికి బీజం బయట ఎక్కడో ఉండదు… మనలోనే ఉంటుంది. ఆ బీజాన్ని గుర్తించి, నాటి, ప్రేమతో పెంచితే… ఒక రోజు అది కేవలం మన జీవితాన్నే కాదు, మరెందరికో ఉపాధి కల్పించే మహావృక్షంగా ఎదుగుతుంది.

అదే ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం మనకు ఇచ్చే అత్యంత విలువైన సందేశం. ఉద్యోగాన్ని వెతికే యువతగా కాకుండా… అవకాశాలను సృష్టించే నాయకులుగా, ఆవిష్కర్తలుగా, ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఈ దినోత్సవం స్ఫూర్తినిస్తుంది.

click here to read more

+++++++++++++++++++++++++++++

.అభిమాన స్నేహబంధం

సాధారణంగా మనం కళా రంగంలో ఉన్న వ్యక్తులను అభిమానిస్తాం కదా.ఒక స్థాయి దాటాక వాళ్ళని ఆరాధిస్తాం కూడా. అలా మనం ఆరాధించే వ్యక్తులు అనుకోకుండా మనకు పరిచయం అయి మనతో కొంచెం బాగా మాట్లాడితే ఆటోమేటిగ్గా మన మనసు వాళ్ళతో స్నేహాన్ని కోరుకుంటుంది.వాళ్ళతో స్నేహం చెయ్యడానికి మనవైపు నుండి ప్రయత్నాలు ప్రారంభిస్తాం.అదృష్టం బాగుంటే వాళ్ళు మనతో స్నేహం చేస్తారు.లేదంటే లేదు. వాళ్ళకి ఎవరు ఇష్టమో వాళ్ళతోనే స్నేహబంధాన్ని కొనసాగిస్తారు. ఇక్కడే మన లాంటి వాళ్ళం బాధపడేది.
ఎవరెవరితో స్నేహం చేసే ఆ కళాకారులు మనతో ఎందుకు స్నేహం చెయ్యరు ? మనకేం తక్కువ ? అన్న భావం కలుగుతుంది. క్రమేణా ఈ భావం కోపం గాను లేక ఆత్మన్యూనత గాను మారే ప్రమాదం ఉంది కూడా.
అయితే ఇక్కడం మనం గమనించాల్సింది వాళ్లు ఎవరితో స్నేహం చేస్తున్నారు అని. వాళ్లకు అవసరం ఉన్నవాళ్ళతో లేదా వారి రంగానికి సంబంధించిన కళాకారులతో మాత్రమే అని మనం గుర్తించాలి. అప్పుడు మనకు వాళ్ళెందుకు మనతో స్నేహం చెయ్యరు అన్న వాస్తవం అర్థం అవుతుంది.నిజంగానే మనకు వాళ్ళతో స్నేహం కావాలి అని అనుకుంటే వాళ్ళకు మన అవసరాన్ని సృష్టించాలి లేదా వాళ్ళ రంగంలోకి మనం అడుగు పెట్టి ఎదగాలి.అప్పుడే వాళ్ళ స్నేహం మనకు దొరుకుతుంది.ఇదంతా కుదరదు అనుకుంటే వాళ్ళనుండి మనం దూరంగా వెళ్ళిపోవాలి. ఈ చేదు వాస్తవాన్ని అంగీకరిస్తే , ఇలాంటి అనవసరమైన మానసిక బాధలు పోయి జీవితం తీపి అవుతుంది. అంతే కదా ఫ్రెండ్స్ !!!

+++++++++++++++++++++++++++++++++

తెలుగు విశ్వ విద్యాలయం

తెలుగు కళల మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం! అద్భుతమైన వ్యక్తీకరణ. సాహిత్యమే సమస్తము అనుకుని, ఆకలీ, నిద్రా లేక ఎక్కడ ఉన్నామో, ఎక్కడకు పోతున్నామో తెలియని ఆవేశంలో…, చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ ఎక్కడకో పోతున్న మనల్ని రెక్క పట్టి నిలబెట్టి లోకం…అన్నాడు మహాకవి.

సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం, అంతకు ముందు దాని పేరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు కళల సౌధం అది. కళలకు ఒక విద్యాలయం ఉండాలి అని కల కనడం, దానిని కార్య రూపంలో పెట్టడం, ఆశ్చర్యం, అద్భుతం. నాటకం, సంగీతం, సాహిత్యం, నృత్యం, జానపదం, జర్నలిజం, చిత్ర లేఖనం, శిల్పం, … మొదలైన వాటికి యూనివర్సిటీ స్థాయిలో గొప్ప గౌరవం కల్పించి M.A. , M.P.A. డిగ్రీలు ఇచ్చి, పై పరిశోధన చేయాలకునే వారికి M.Phil, Ph.D అవకాశాలు ఉండడం ఎంతో గొప్ప విషయం కదా.

బోధన, పరిశోధన, ప్రచురణ, విస్తరణ … ఇలా లక్ష్యాలు ఏర్పరచుకుని తెలుగు విశ్వ విద్యాలయం ముందుకు వెళుతోంది. హైదరాబాదులో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ పక్కన Main Campus ఉంది. అలాగే వరంగల్లు, శ్రీశైలం, కూచిపూడి, రాజమండ్రిలలో కూడా బ్రాంచీలు ఉన్నాయి. సొంత బిల్డింగ్స్ ఉన్నాయి. గత ముప్పై ఏళ్లలో ఎన్నో విజయాలు తెలుగు విశ్వ విద్యాలయం సాధించింది. ఉత్సాహం చూపించే విద్యార్థులు పెరిగారు.

తర్వాత హైదరాబాదులో బాచుపల్లిలో సుమారు వంద ఎకరాలు స్థలం ప్రభుత్వం ఇచ్చింది, రాష్ట్ర విభజనకు ముందే ఉమ్మడి రాష్ట్ర నిర్ణయం అది. ఇది తెలుగు ప్రజల అందరి కళల గౌరవం!

కానీ విశ్వ విద్యాలయం స్థాయికి ఆ బాచుపల్లి క్యాంపస్ కూడా తక్కువ కిందే లెక్క! కనీసం ఐదు వందల ఎకరాలు ఉండాలి. అయినా సరిపెట్టుకుని, తెలుగు విశ్వ విద్యాలయం అక్కడ అంటే బాచుపల్లిలో కొన్ని శాఖలను సర్దుకుని విస్తరించుకుంది. Nampally Campus is the main face of the University. ఇక్కడ చూసే విద్యార్థులు ఆయా Course ల్లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తారు. బాచుపల్లి క్యాంపస్ అంతా Chemical smell. ఎన్నో రసాయన ఫ్యాక్టరీలు మధ్య అక్కడ యూనివర్సిటీ ఉంది. అక్కడ నీరు కలుషితం, గాలి కలుషితం. అయినా నేటి కలియుగంలో తప్పదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సరిపెట్టుకుని, భరిస్తూ చదువు కొన సాగిస్తున్నారు. అక్కడే హాస్టల్ భవనాలు ఉన్నాయి. ఇంతకు ముందు త్రివేణి హాస్టల్ అని ఉస్మానియా యూనివర్సిటీ NCC గేట్ పక్కన ఉండేది. దాని లీజు అయ్యాక, Renewal సమయంలో ఏం జరిగిందో తెలీదు, దానిని తెలుగు విశ్వ విద్యాలయం వదులుకుంది. అది దురదృష్టం. ఎందరో పేద విద్యార్థులకు త్రివేణి హాస్టల్ తల్లిలా ఆశ్రయం కల్పించి సేద తీర్చింది. దానిని తెలుగు విశ్వ విద్యాలయం already కోల్పోయింది.

ఇప్పుడు Nampally Campus మీద కొందరి కన్ను పడింది. ఇక్కడ ఇంకా ఎన్నో కోర్సులు నడుస్తున్నాయి. నాటకం, నృత్యం రిహార్సల్స్, ప్రదర్శన, ఆడిటోరియం, Design, జ్యోతిష్యం, Distance education…., ఇంకా సిటీతో సంబంధాలు అన్నీ ఇక్కడే. దీనిని కాపాడుకోవడం మన బాధ్యత. విద్యార్థులు తెలుగు విశ్వ విద్యాలయం Nampally Campus ని కాపాడుకోవడం కోసం ఉద్యమ బాట పట్టారు. తెలుగు విశ్వ విద్యాలయం మెయిన్ క్యాంపస్ ఉండడం అవసరం, తప్పనిసరి! ఇది వ్యాపార కోణంలో చూస్తే అర్థం కాదు.

గుండె, ఆత్మలను కళల అమృతంలో ముంచి, ప్రక్షాళన మార్గంలో మనో దిక్సూచిని నడిపించి, భవిష్యత్ ఇంద్ర ధనుస్సుని చూస్తేనే, అలా చూసే సున్నితత్వం ఉంటేనే, ఆ Aesthetic అనుభవం హృదయంతరాల్లో కలిగితేనే ఆ బాధ అర్థం అవుతుంది. తెలుగు విశ్వ విద్యాలయం Nampally Campus లో ఒక చిన్న ఇంచు(inch) వేరే వాళ్ళకి ఇచ్చినా అది కళలకు ప్రమాదం! భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్టే లెక్క! Commercial purposes తో కాకుండా…., వ్యాపార దృష్టి కోణంలో నడిచే కోర్సులు కాదు ఇవి. ఎందరో పేద దళిత, బహుజన విద్యార్థులు ప్రేమతో, ఆర్తితో, గొప్ప ఉత్సుకతతో, ఈ కోర్సుల్లో ప్రావీణ్యత సంపాదించుకోవడం కోసం చేరుతున్నారు. University అనేది ఒక Endorsement. రాజముద్ర.

ఎన్నో వందల, వేల ఏళ్ల నుంచి మౌఖింగా ప్రయాణిస్తున్న ఎన్నో కళలు ఇవాళ తెలుగు విశ్వ విద్యాలయం వల్ల ఒక ప్రామాణికతను పొందాయి. దాని వల్ల కొందరికి ఉద్యోగం, ఉపాథి దొరికినా, ఎక్కువ మంది తమ వైయక్తిక ఉత్సాహంతో ఆ కళల ఔన్నత్యాన్ని కాపాడడానికి తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు. భవిష్యత్తు ఉందో లేదో తెలీదు, కానీ ఆ కళలను నేర్చుకుంటున్నారు యూనివర్సిటీలో చేరి! ప్రజలు ఇంతలా నిలబడినప్పుడు, ప్రభుత్వాలు కూడా ఆలంబనగా నిలబడి తమ గౌరవం కాపాడుకోవాలి!

తెలుగు విశ్వ విద్యాలయం ముఖ ద్వారాన్ని వేరే ఎవరో కబ్జా చెయ్యాలనుకుంటే ఎలా? ఉద్దేశ్యం ఏదైనా కావొచ్చు. కానీ అది మహాపాపం! నిజమైన Artifact లు తెలుగు విశ్వ విద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు. జీవం లేని వస్తువులు కన్నా, జీవంతో ఉన్న మనుషులు, విద్యార్థులు గొప్ప కదా, అపురూపం కదా! రేపు ఇంకా గోప్ప కళాఖండాలను సృష్టి చేసేది ఈ విద్యార్థులే కదా! గొప్ప నాటకాలు, గొప్ప సినిమాలు, కథలు, కవిత్వం, ఇంకా ఎన్నో జానపద కళా రూపాల సృష్టి ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థుల ద్వారా జరుగుతుంది!

తెలుగు విశ్వ విద్యాలయం Nampally Main Campusని కాపాడుకోవాలి అని ఇప్పుడు నిరసన తెలుపుతున్న విద్యార్థుల గొంతుక చిన్నది కావొచ్చు, కానీ వారి సంకల్పం ఎంతో ఉత్కృష్టమైనది, వారి నిరసన గళం వెనుక ఉన్న ఔన్నత్యం ఆకాశం అంత ఎత్తులో ఉంది! భవిష్యత్తు తరాలు నేడు ఈ రిలే నిరసన దీక్షల్లో రోజూ పాల్గొంటున్న విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు శ్రమ, సమయం, శక్తి, త్యాగం అన్నీ గుర్తు పెట్టుకుని మీ గొప్ప హృదయాలకు కృతజ్ఞతలు తెలుపుతాయి!

ముందు క్యాంపస్ ను కాపాడుకోండి. తర్వాత దానిని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించుకోవచ్చు, లలిత కళాపీఠంలో కొన్ని శాఖలు ఇక్కడ ఉంచడం, Ph.D scholars కు 18 నెలలు వసతి…. ఇలాంటి నిర్ణయాలు తర్వాత ఆలోచించి, చర్చలు చేసి నిర్ణయం తీసుకోవచ్చు.

ఇప్పుడు అందరూ ఐక్యతతో తెలుగు విశ్వ విద్యాలయం నాంపల్లి క్యాంపస్ ను వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకుందాం!

Academics are enough for this country. Maths, Physics, Chemistry, Biology, Zoology, Electronics, Computers…., Social sciences…. అన్నీ గొప్పవే! మానవాళికి అవసరం! ఇలాంటివి చెప్పడానికి కొన్ని వందల, వేల ప్రైవేట్, గవర్నమెంట్ సంస్థలు, Schools, Engineering Colleges, విశ్వ విద్యాలయాలు ఉన్నాయి. కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మార్కుల వెంట పరుగు. ఆటలు లేవు, పాటలు లేవు, ఒలింపిక్ పతకాలు లేవు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లక్షల మంది విద్యార్థులు ఆ సబ్జెక్టులు చదివారు. కానీ గొప్ప ఫలితాలు కనపడలేదు. పరిశోధనలు చెబుతున్నాయి, అద్భుత పరిశోధనలు జరిగి విశిష్ట ఆవిష్కరణలు జరిగినవి బహు తక్కువ. ఎంత మంది చదివారు? ఎన్ని పరిశోధించి గొప్ప సూత్రాలు కనిపెట్టి, దేశ పురోగతికి సంబంధించిన రంగాల్లో ఎంత Contribute చేశారు? అని తులనాత్మకంగా పోల్చినప్పుడు అంతా నిరాశ. మేధో వలసలు ఎక్కువ జరిగాయి! అసలు దేశ మేధస్సుగా మారిన విద్యార్థులు తక్కువ.

అంత బద్దకం, అలసత్వం, బానిస మనస్తత్వాలు, నిరాశ, బాధ్యతా రాహిత్యం…., విద్యా రంగాల్లో రాజ్యం, చేశాయి, చేస్తున్నాయి. ఇప్పటికీ దేశం కళ్ళు తెరవలేదు!

దేశానికి ఇప్పుడు కావలసినవి లలిత కళలు, ఆటలు, పాటలు, నాటకం…., ఇవన్నీ కూడా Academics లో భాగం. Urgent. Emergency SOS ద్వారా ప్రభుత్వాలకు కాల్ చేసి చెప్పాలి. Awareness కలగ చేయాలి! లేదంటే మనుషులు మర మనుషుల్లా, జీవం లేని శవాల్లా, స్వార్ధ జంతువుల్లా మారి, మీ ఆనందం కన్నా ఎదుటి వారి క్షోభ సంతృప్తి నిచ్చే లోకం (చలం ప్రయోగం) తయారు అవుతుంది.

దురదృష్టం, వీటిని Extra curricular, లేదా Co-curricular activities గా పరిగణించి వీటి ఔన్నత్యాన్ని చిన్న చూపు చూసారు, ఇంకా చూస్తున్నారు! King of the sciences Physics అంటారు. King of the fine arts Theatre education. Theatre is a Composite Art Form.

నాటకం సరిగ్గా నేర్చుకుంటే, అందులో దాదాపు అన్ని లలిత కళలు సమ్మిళితం అయ్యి ఉంటాయి! నాటకం సమాహార కళ!

అటువంటి గొప్ప కళలను నేర్పుతున్న తెలుగు విశ్వ విద్యాలయం, దేశానికి, ప్రపంచం మొత్తంలో వున్న ఇంచుమించు 20 కోట్లకు పైగా ఉన్న తెలుగు ప్రజలకు గుండెకాయ సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం! యూనివర్సిటీ ముఖద్వారం నాంపల్లి క్యాంపస్! దానిని కాపాడుకుందాం! విద్యార్థులు నిరసన తెలపడం వారి హక్కు. If you are trembling with indignation at every injustice then you are a comrade of mine! ఇది నా వాక్యం, నా నిరసన! నా భాష!

నేడు యూనివర్సిటీకి, నిస్వార్థంగా పని చేసే VC, Registrar లు ఉన్నారు. VC ఆచార్య శ్రీ వెలుదండ నిత్యానందరావు గారు, ఎప్పుడూ విద్యార్థుల మేలు కోరే మనసున్న గొప్ప వ్యక్తి ఆచార్య శ్రీ కోట్ల హనుమంత రావుగారు, కృష్ణార్జునల్లా పని చేస్తున్నారు. ఇద్దరూ తెలుగు విశ్వ విద్యాలయం మేలు, అభివృద్ధి కోరుకుంటూ, నిస్వార్థంగా పని చేస్తున్నారు.

దయ చేసి విద్యార్థుల నిరసనను వీరిద్దరూ, మంచి హృదయంతో అర్థం చేసుకోవాలి. మీ మీద మాకు గౌరవం ఉంది! కానీ యూనివర్సిటీ క్యాంపస్ కాపాడుకోవడం పరిశోధక విద్యార్థులుగా మా విధి! అర్థం చేసుకోండి!

తెలుగు విశ్వ విద్యాలయం నిరసనల్లో ఎందరో విద్యార్థులు పాల్గొంటున్నారు! అందరికీ అభినందలు! దేవతల్లా కొందరు మహిళా పరిశోధక విద్యార్థులు ఎంతో సమయం వెచ్చించి నిరసనల్లో భాగం అయ్యారు! అద్భుతం! మీ లక్ష్యం, మన లక్ష్యం ఈ ప్రకృతి నెరవేర్చును గాక! తెలుగు కళల మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం, నాంపల్లి క్యాంపస్ తెలుగు విశ్వ విద్యాలయానికి ధ్వజ స్తంభం లాంటిది! దానిని కాపాడుకుందాం! సత్యమేవ జయతే!

+++++++++++++++++++++++++++++++++++++

టి టి డి అంటే ఒక దేవస్థానం కాదు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల పరిపాలనా వ్యవహారాలను చూసే వ్యవస్థను తిరుమల తిరుపతి దేవస్థానములు (టి టి డి) అని పిలుస్తారు. 80 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన ఆ వ్యవస్థ పేరులోనే ఒక తిరుమల దేవాలయానికే కాకుండా పలు దేవాలయాల నిర్వహణకు సంబంధించినదనే సంకేతం దాగి ఉంది.
వివిధ రాజవంశాల పర్యవేక్షణ అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్వహణ మద్రాసు రాష్ట్రం తో పాటు 1750 లో బ్రిటిష్ వారి పరమైంది. తొలి దశలో తిరుమల క్షేత్రాన్ని తమ ప్రతినిధుల పర్యవేక్షణతో ఒక ఆదాయపు వనరుగా వినియోగించుకున్న బ్రిటిష్ పాలకులు పలుకారణాలతో 1843 లో స్థానికంగా ఉన్న హత్తిరాం బావాజీ మఠ నిర్వాహకులైన మహంతును విచారణ కర్తగా నియమించారు. అప్పటి నుంచి 1933 వరకు 90 ఏళ్ల పాటు తిరుమల క్షేత్ర పాలన 6 గురు మహంతుల పాలనలో కొనసాగింది. 1933 లో మద్రాసు అసెంబ్లీలో చేసిన ప్రత్యేక చట్టం ప్రకారం తిరుమల క్షేత్ర పాలనను స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థకు ఇచ్చే ఏర్పాటు జరిగింది. తిరుమలలోనే కాక తిరుపతి లో పరిసరాలలో ఉన్న ప్రాచీన అనుబంధ ఆలయాల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి పేర్లు కలిసి వచ్చే విధంగా ఉమ్మడి దేవస్థానాల పాలక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ క్రమంలోనే ఆరు ఉపాలయాల సహితంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, 15 ఉపాలయాల సహితంగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, 3 ఉపాలయాల సహితంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, 5 ఉపాలయాల సహితంగా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయం, తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీ కపిలేశ్వరాలయం, శ్రీనివాసమంగాపురం లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయం, నాగలాపురం లోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయాలతో 8 ప్రధాన ఆలయాల సమాహారంగా పరిపాలనా వ్యవస్థ ఏర్పడింది. ఇన్ని ఆలయాల సమన్వయ పాలన కలిసి ఉన్నందున ఆ వ్యవస్థకు తిరుమల తిరుపతి దేవస్థానములు ( టి టి డి) అనే నామకరణం జరిగింది. ఆరంభంలో ప్రభుత్వ ప్రతినిధి అధీనంలో స్థానిక ప్రతినిధులతో ఏర్పాటైన వ్యవస్థకు దేశ స్వాతంత్రం వచ్చి 1950 లో గణతంత్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత 1951 లో చేసిన చట్ట సవరణలు ఇప్పటి టి టి డి పాలనా వ్యవస్థ కు మౌలిక రూపంగా నిలిచింది.
80 ఏళ్ల క్రితం 8 దేవాలయాల సమూహ పాలన కోసం ఏర్పాటైన టి టి డి పరిధిలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 ప్రధాన దేవాలయాలు, 60 దాకా అనుబంధ దేవాలయాల నిర్వహణ ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగుతోంది. ఇది కాక టి టి డి సహాయ సహకారాలతో రూపు దిద్దుకున్న వేలాది చిన్న చిన్న దేవాలయాల పాలనా వ్యవస్థలు కొనసాగుతున్నాయి. అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా తిరుమల క్షేత్ర పాలన వ్యవస్థ ను ఒక దేవస్థానం పేరుతో కాకుండా దేవస్థానములు అనే బహువచన నామంతో పిలుస్తారు.

ఓం నమో వేంకటేశాయ