37,440 people | రేపే లాస్ట్!

37,440 people | రేపే లాస్ట్!
- ముమ్మరంగా తొలి విడత ప్రచారం
- 3,836 పంచాయతీల్లో హోరు
- వినూత్న ప్రచారంలో అభ్యర్థులు
- హామీలతో ఓటర్లను ఆకట్టుకుంటున్న అభ్యర్థులు
37,440 people | తెలంగాణ న్యూస్ నెట్‌వర్క్ , ఆంధ్రప్రభ : రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి రేపు చివరి రోజు. అందుకే నిన్నటి నుంచి ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రతి ఊరులో ప్రచారాలు హోరెత్తి పోతున్నాయి. చివరి రోజు దగ్గర పడడంతో వినూత్న ప్రచారాలు కొనసాగిస్తున్నారు. వ్యక్తిగత హామీలతోపాటు తమకు మద్దతు ఇచ్చే పార్టీ నేతల(Party leaders)తో కూడా హామీలు ఇప్పిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి ఎన్నో రకాల ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు.
37,440 people | మొదటి విడతలో 3,836 పంచాయతీలకు ఎన్నికలు..
రాష్ట్రంలో తొలి దశలో 4,236 పంచాయతీల(4,236 panchayats)కు నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషనర్ జారీ చేశారు. ఇందులో ఐదు పంచాయతీలకు వివిధ కారాణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. 395 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,836 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
సర్పంచ్ పదవులకు 13,127 మంది, వార్డు సభ్యులకు 37,440 మంది పోటీ(37,440 people contesting)లో ఉన్నారు. 149 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాని వాటిలో మంచిర్యాల జిల్లాలో మూడు, ఆసిఫా బాద్, నిర్మల్లో ఒక్కో పంచాయతీ ఉన్నాయి. వార్డున సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు కాని వార్డులు అత్యధికంగా ఆసిఫాబాద్‌లో 41, మంచిర్యాలలో 34 ఉన్నాయి.
37,440 people | ప్రచారాల హోరు…
తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. వినూత్నంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. నిన్న మటన్ షాప్ వద్ద మటన్ కట్ చేస్తూ మహిళ కాంగ్రెస్ నాయకురాలు ప్రచారం చేయగా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad district)లో బార్బర్ షాపులో ఓ సర్పంచ్ అభ్యర్థి కటింగ్ వేస్తూ ప్రచారం చేశారు. తంగళ్లపల్లి పొలంలో మహిళలతో కలిసి అభ్యర్థి ప్రచారం చేశారు.
37,440 people | వ్యక్తిగత హామీలు..

రాష్ట్రంలో అనేక పంచాయతీల్లో ప్రచారాల్లో సర్పంచ్ అభ్యర్థులు వ్యక్తిగత హామీలు కూడా ఇస్తున్నారు. కొందరు బాండ్ పేపరు(bond paper) మీద హామీలు ఇస్తూ ఓటర్లకు చూపిస్తున్నారు. కొందరు అభ్యర్థులు అక్రమ ఆస్తులు సంపాదిస్తే జప్తు చేసుకోవచ్చునని బాండ్ పేపరు మీద రాసి గ్రామ పెద్దలకు అందజేస్తున్నారు.
ఆడ పిల్ల పుడితే రెండు వేలు ఒకరు, ఐదు వేలు ఒకరు డిపాజిట్(deposit) చేస్తామని ప్రకటిస్తున్నారు. బంధువులు వచ్చే వరకూ మృత దేహాలు ఉంచడానికి ఫ్రీజు శవ పేటికలు కూడా అందజేస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే కాంగ్రెస్ మద్దతు దారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామానికి అధికంగా వచ్చేలా కూడా హామీలు ఇస్తున్నారు.
click here to read పెద్దబుగ్గ ఆలయంలో అన్నప్రసాదం
click here to read https://www.google.com/search?q=prabhanews.com&oq=&aqs=chrome.3.69i59i450l8.15436j0j7&sourceid=chrome&ie=UTF-8
