HYD | పన్ను బకాయిలపై జీహెచ్ఎంసీ చర్య

HYD | పన్ను బకాయిలపై జీహెచ్ఎంసీ చర్య
HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన భవనంపై జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న జయలలితకు సంబంధించిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఆస్తి పన్ను బకాయిలు దీర్ఘకాలంగా చెల్లించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.
2017 నుంచి ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో సీజ్ ప్రక్రియ అమలు చేశారు. ఉప కమిషనర్ సురేశ్ ఆదేశాల మేరకు ఏఎంసీ బాల్రాజ్ నేతృత్వంలో అధికారులు భవనాన్ని సీజ్ చేశారు. సుమారు రూ.82.91 లక్షల మేర పన్ను బకాయిలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
