Jnana Saraswati | వైభవంగా జ్ఞాన సరస్వతీ మహా యజ్ఞం

Jnana Saraswati | మక్తల్, ఆంధ్రప్రభ : శ్రీ సరస్వతీ శిశు మందిర్ మఖ్తల్ పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 45 మంది చిన్నారులు అక్షరాభ్యాసం నిర్వహించుకున్నారు. మఖ్తల్ వాసవి వనిత క్లబ్ మండల అధ్యక్షురాలు కల్వా ప్రసన్నముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమం నిర్వహించారు.

పూజా కార్యక్రమం అనంతరం సప్త శక్తి సంగం ప్రముఖ్ నాగలక్ష్మీ మాట్లాడుతూ… మాఘ శుద్ధ పంచమి రోజున సరస్వతీ దేవి జన్మదినముగా భావించి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తారని ఈ రోజున అక్షరాభ్యాసం చేసుకున్న చిన్నారుల పై ఆ సరస్వతీ దేవి యొక్క ఆశీస్సులు కృపా కటాక్షం నిండుగా ఉంటాయని అన్నారు. చిన్నారులకు చదువుతోపాటు దేశము, ధర్మము వంటి సామాజిక అంశాలపై కూడా అవగాహన కల్పించాలని వాటితోనే విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి జరుగుతుందని సాధ్యమని అన్నారు.
ఈ విషయంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతకుముందు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య జ్ఞాన సరస్వతీ మహా యజ్ఞం వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత చిన్నారులకు తల్లిదండ్రులు పండితులచే అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు కొడంగల రఘుప్రసన్న భట్, ప్రతాప్ రెడ్డి, కావలి వెంకటేష్, కొండా విజయ్ కుమార్, పాఠశాల ప్రధానాచారి బి.కుర్మయ్య, పూర్వ విద్యార్థులు నాగలక్ష్మీ, పూర్వ ఆచార్యులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
