MLHP | ఉద్యోగానికి రాజీనామా…

MLHP | ఉద్యోగానికి రాజీనామా…

  • మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడి

MLHP | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దొనబండ వెల్ నెస్ సెంటర్ లోఎం ఎల్ హెచ్ పీగా పనిచేస్తున్న గుర్రం శ్రావణిగౌడ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ రోజు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

బెల్లంపల్లి పట్టణా కినికి చెందిన తాను మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న తనను బెల్లంపల్లి పట్టణ ప్రజలు ఆశీర్వదించాలని ఆమె కోరారు.

నిత్యం ప్రజల మధ్యలో ప్రజలకు అండగా ఉండి నిస్వార్ధంగా సేవచేసేందుకు తాను తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఆమె పేర్కొన్నారు. వ్యక్తిగత స్వార్ధం కోసం తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రజల అభివృద్దే ధ్యేయంగా పెట్టుకొని రాజకీయాల్లోకి వస్తున్నట్లు శ్రావణి గౌడ్ స్పష్టం చేశారు.

Leave a Reply