Literacy program | ఘనంగా అక్షరాభ్యాస వేడుకలు

Literacy program | చిట్యాల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధి చిట్యాల మండలం గుండ్రాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు చదువుల తల్లి సరస్వతి దేవి జన్మదినం సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గోగికార్ రమాదేవి ఆధ్వర్యంలో గ్రామంలోని చిన్నారులకు పాఠశాలలోని సరస్వతిదేవి విగ్రహం దగ్గర అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో బాలబాలికలను చేర్పించి వారి ఉన్నతమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని, జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి ఆశీస్సులతో విద్యార్థులందరూ ప్రగతి మార్గంలో పయనించాలని తెలిపారు. అలాగే గుండ్రాంపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి అంగన్వాడి మూడు, నాలుగు కేంద్రాలలో ప్రధానోపాధ్యాయులు గోగికార్ రమాదేవి చేతుల మీదుగా బాలబాలికలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మసరం శ్రీనివాస్, అండాలు, వెంకట్రావు, అఫ్జల్ షరీఫ్, డా. ఉప్పల పద్మ, రాంరెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకటరమణ జూనియర్ అసిస్టెంట్స్ నరసింహ, ప్రణయ, రేణుకలతో పాటు గ్రామంలోని చిన్నారుల తల్లిదండ్రులు నార్సింగ్ వెంకటేష్, గరిశె శేఖర్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు బి. ఇందిర, డి. కళమ్మలతో పాటు ఆయాలు అమరావతి, లక్ష్మమ్మ, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
