హైదరాబాద్ : ఫార్ములా రేస్ కేసు నేపధ్యంలో కేటీఆర్ ను విచారణకు రావాల్సిందిగా ఎసిబి నోటీసులు ఇవ్వడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు, కేటిఆర్ సోదరి కవిత తప్పు పట్టారు. E మేరకు వారు తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.
ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర అంటూ… హరీష్ రావు ధ్వజమెత్తారు. . రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభద్రతాభావం లో ఉందని… అందుకే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. ఇలాంటి దొంగ కేసులు… కోర్టు ముందు తేలిపోతాయని… ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ కేసు విషయంలో కేటీఆర్ వెంట మేముంటామని ప్రకటించారు హరీష్ రావు. నిజం త్వరలోనే.. ఈ కేసులో బయటకు వస్తుందని పోస్ట్ పెట్టారు హరీష్ రావు.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి…
Mతమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత.
”ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది” అంటూ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని కవిత అన్నారు