100/112emergencycalls | రోడ్డు ప్రమాదాలలో మొదటి గంట ఎంతో ముఖ్యమైంది

100/112emergencycalls | రోడ్డు ప్రమాదాలలో మొదటి గంట ఎంతో ముఖ్యమైంది

100/112emergencycalls \ –ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్

100/112emergencycalls | రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

చౌటుప్పల్, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ): రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో మొదటి గంట (గోల్డెన్ అవర్) ఎంతో కీలకమని, ఆ సమయంలో స్పందించే విధానం బాధితుల ప్రాణాలను కాపాడుతుందని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన’లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ – అలైవ్’ (Arrive – Alive) క్యాంపెయిన్ – 2026 లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు సాగే ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది.

100/112emergencycalls
100/112emergencycalls

గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై శిక్షణ

చౌటుప్పల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించిన ఈ ‘గోల్డెన్ అవర్ ట్రైనింగ్’ లో డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్లు, వాలంటీర్లు మరియు స్థానిక ప్రజలకు అత్యవసర స్పందనపై అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు అందించాల్సిన ప్రథమ చికిత్స, వారిని సురక్షితంగా ఆసుపత్రికి తరలించే పద్ధతులపై ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్ వివరించారు. అత్యవసర సమయాల్లో 100 లేదా 112 నంబర్లకు కాల్ చేసి పోలీసుల సహాయం ఎలా పొందాలో వివరించారు.

భారీగా పాల్గొన్న సిబ్బంది మరియు ప్రజలు

రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఈ సందర్భంగా పోలీసులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్ తో పాటు ఎస్‌ఐ ఉపేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, వైద్యులు, అంబులెన్స్ డ్రైవర్లు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply