ఐపీఎల్ మ్యాచ్ మోజు.. బావిలోకి దూసుకెళ్లిన కారు

ఐపీఎల్ మ్యాచ్ మోజు.. బావిలోకి దూసుకెళ్లిన కారు

  • యువకుడు మృతి

జగిత్యాల, ఆంధ్రప్రభ ; జగిత్యాల జిల్లాలో సెల్‌ఫోన్‌ వినియోగంలో నిర్లక్ష్యం విషాదానికి దారితీసింది. మొబైల్‌లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ కారు నడపడం వల్ల వాహనం బావిలో పడిపోయి ఒక యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామం సమీపంలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, జగిత్యాలకు చెందిన నివేష్, అశ్విన్, అరుణ్ అనే ముగ్గురు యువకులు థార్ వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో వారు మొబైల్‌లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నారు. వాహనం నడుపుతున్న అరుణ్ మ్యాచ్‌పై దృష్టి పెట్టడంతో రోడ్డు గమనించలేకపోయాడు. దీంతో అదుపుతప్పిన కారు రోడ్డుపక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న అరుణ్ బావిలో మునిగి మృతి చెందాడు. నివేష్, అశ్విన్ గాయాలతో బయటపడగా, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు రెండు గంటల పాటు శ్రమించి అరుణ్ మృతదేహంతో పాటు కారును బావి నుంచి బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply