MBNR | తెలంగాణ ఉద్యమకారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్, జూన్ 2 (ఆంధ్రప్రభ) : తెలంగాణ ఉద్యమకారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తున్నట్లు మక్తల్ ఎమ్మెల్యే డా.వాకిటి శ్రీహరి ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మక్తల్ పట్టణంలోని నారాయణపేట క్రాస్ రోడ్ వద్ద తెలంగాణ ఉద్యమకారులు జి.నీలప్ప ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈసందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడంతో పాటు తెలంగాణ అమరవీరులకు పుష్పాంజలి ఘటించాలి. అనంత‌రం ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో మక్తల్ నియోజకవర్గంలో పాల్గొన్న ఉద్యమకారులందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి సన్మానించుకోనున్నట్లు ప్రకటించారు. ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులందరినీ ఎంతమంది ఉంటే అంతమందికి ఇళ్ల‌ను కేటాయిస్తామని చెప్పారు.

తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ఉద్యమకారుల పాత్ర కీయాశీలకమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జి.లక్ష్మారెడ్డి, చంద్రకాంత్ గౌడ్, బోయ రవికుమార్, బి.గణేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply