Indians | గెలుపు ఎవరిది?
Indians | గెలుపు ఎవరిది?
Indians | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత భారీ పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా దశాబ్ద కాలపు రైవల్రీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) vs ముంబై ఇండియన్స్ (MI) మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే, టాస్ ముగిసిన తర్వాత వెలువడిన వార్తలు ఇరు జట్ల అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
చెన్నై స్పిన్ పిచ్‌పై లక్ష్యాన్ని నిర్దేశించడమే తమ వ్యూహమని హార్దిక్ తెలిపాడు.ఈ మ్యాచ్‌లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, చెన్నై దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఇద్దరూ ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోవడం అతిపెద్ద సంచలనంగా మారింది. వీరిద్దరూ లేకుండా ఈ జట్లు తలపడటం చాలా ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.

ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ , బుమ్రాతో ముంబై బలంగా కనిపిస్తోంది. అశ్విని స్థానంలో క్రిష్ తుది జట్టులోకి వచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్‌లతో చెన్నై బరిలోకి దిగుతోంది. నూర్ అహ్మద్, ముకేశ్ చౌదరి బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నారు. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ లేని లోటును ఇరు జట్లు ఎలా భర్తీ చేస్తాయో, చేపాక్ కోటలో ‘థలైవా’ లేకుండా చెన్నై ఎలా నెగ్గుకువస్తుందో వేచి చూడాలి.
CLICK HERE TO READ MORE : Sunrisershyd | క్లాసెన్ సింప్లిసిటీపై నెటిజన్లు ఫిదా
