India vs SA | నాలుగోది ఎవ‌రిదో?

India vs SA | నాలుగోది ఎవ‌రిదో?

  • సౌతాఫ్రికా, భారత్ మధ్య నాలుగో టీ20
  • లక్నో అటల్ బీహారి వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలో..
  • రాత్రి 7గంట‌ల‌కు ఆట ప్రారంభం
  • ఈ మ్యాచ్ గెలిస్తే భార‌త్‌దే సిరీస్‌?

India vs SA | సౌతాఫ్రికా, భారత్ మధ్య టీ20 సిరీస్ నువ్వా నేనా అన్న‌ట్టు సాగుతోంది. రెండు మ్యాచ్‌లు భార‌త్ గెలిస్తే… ఒకటి స‌ఫారీ జ‌ట్టు గెలిచింది. ఈ రోజు లక్నో వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య నాలుగో టీ20 జరగనుంది. అటల్ బీహారి వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ ప‌ట్టేస్తుంది. అయితే విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి. అయితే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు గత మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.

India vs SA

అదే సమయంలో జట్టులోని కొందరు కీలక ఆటగాళ్ల ఫామ్ మాత్రం ఆందోళనకు కారణమవుతోంది. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ శుభమన్ గిల్ ప్రదర్శనపై చర్చ కొనసాగుతోంది. టీ20 ఫార్మాట్‌లో స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన సూర్యకుమార్ యాదవ్ గత 21 ఇన్నింగ్స్‌లుగా అర్ధశతకం నమోదు చేయలేకపోయారు. మరోవైపు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా ఈ సిరీస్‌లో స్థిరమైన ఆట చూపించలేక తడబడుతున్నారు. భార‌త బౌలింగ్ విభాగం ఇంకా మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. వరుణ్ చక్రవర్తి ఒక్క‌డే తన స్పిన్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు. పవర్‌ప్లే ఓవర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా అంత‌గా ప్రభావం చూపడం లేదు. మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కీలక బాధ్య‌తలు మోస్తున్నారు.

ఎయిడన్ మార్క్రమ్ నాయకత్వంలోని ఆ జట్టు నిలకడలేమితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ రాణిస్తేనే భారత్‌కు గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. లక్నోలోని ఏకనా స్టేడియం పిచ్ ఆరంభంలో పేసర్లకు, స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది.
రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉండగా, ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా వీక్షించవచ్చు.

India vs SA

తుది జట్లు (అంచనా):

భారత్: శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (సి), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ (కీపర్), హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్. దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, ఎయిడన్ మార్‌క్రమ్ (సి), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, లుథో సిపామ్లా, లుంగీ ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.

Leave a Reply