Team India | చీఫ్ సెలెక్టర్ అగార్కర్ పదవీ కాలం పొడిగింపు

Team India | చీఫ్ సెలెక్టర్ అగార్కర్ పదవీ కాలం పొడిగింపు
Team India | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ మరో ఏడాది పాటు కొనసాగనున్నాడు. ఆయన పదవీకాలాన్ని జూన్ 2026 నుండి జూన్ 2027 వరకు పొడిగిస్తూ బీసీసీఐ (BCCI) నిర్ణయం తీసుకుంది. 2023 జూలైలో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అగార్కర్, జట్టులో కీలక మార్పులు తీసుకురావడంలో విజయవంతమయ్యాడు. ఆయన హయాంలో భారత జట్టు 2024, 2026 టి20 ప్రపంచ కప్‌లతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని అగార్కర్ అనుభవం జట్టుకు అవసరమని బీసీసీఐ భావిస్తోంది. అందుకే ఆయన పదవీ కాలాన్ని పొడిగించినట్లు తెలిసింది.
