పెంచిన చమురు ధరలను ఉపసంహరించుకోవాలి

పెంచిన చమురు ధరలను ఉపసంహరించుకోవాలి

  • శ్యాంసుందర్ ముదిరాజ్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; ​కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం వేయడాన్ని చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామం లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు. ఇంధన ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచడం ప్రజలను మరోసారి వంచించడమేనని ఆయన అన్నారు. ​దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని ఇప్పటివరకు నమ్మబలికిన కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల ప్రక్రియ ముగియగానే అసలు రంగు బయటపెట్టిందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన పొదుపు చర్యల వెనుక అసలు ఉద్దేశం.. ఈ ధరల పెంపును కప్పిపుచ్చడానికేనని ఆయన ఆరోపించారు. ​గ్యాస్ ధరలతో ఇప్పటికే ప్రజల నానా అవస్థలు ​ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50, కమర్షియల్ గ్యాస్‌పై దాదాపు రూ.1000 వరకు ధరలను పెంచిందని, దీనివల్ల సామాన్యుల బతుకులు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్యాస్ ధరల పెరుగుదల వల్ల చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, హోటళ్లు నడపలేక మూతపడుతున్నాయని, తద్వారా ఎంతోమంది ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్నారని, పెంచిన చమురు ధరల వల్ల రవాణా రంగంపై పెనుభారం పడనుందని, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగి అంతిమంగా పేద ప్రజలే నష్టపోతారని, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలని శ్యాంసుందర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.

Leave a Reply