AP | దేశ‌ ప్ర‌జ‌లంద‌రికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : డిప్యూటీ సీఎం ప‌వ‌న్

గణతంత్ర దినోత్సవ భారతీయులందరికీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. మన దేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజు జనవరి 26 అని అన్నారు. 75 ఏళ్లుగా రాజ్యాంగం మన దేశానికి సమగ్ర దిశానిర్దేశం చేస్తోందని… రాజ్యాంగ స్ఫూర్తిని శాశ్వతంగా వర్ధిల్లేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

మన దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తిని… రాజ్యాంగాన్ని రచించి మ‌న దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించేందుకు తమ జ్ఞాన సంపదను ధారపోసిన మేధావుల ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి అని అన్నారు.

Leave a Reply