కరీంనగర్ లో హై టెన్షన్

కరీంనగర్ లో హై టెన్షన్

  • బిఆర్ఎస్ బంద్ నేపథ్యంలో
  • మాజీ మంత్రి గంగుల హౌస్ అరెస్ట్
  • బిఆర్ఎస్ నేతల అరెస్ట్
  • దిష్టిబొమ్మ దహనం

కరీంనగర్, ఆంధ్రప్రభ ; కరీంనగర్ జిల్లా కేంద్రంలో హై టెన్షన్ నెలకొంది. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం పై బిజెపి నాయకులు దాడి చేసి ధ్వంసం చేసినందుకు నిరసనగా బిఆర్ఎస్ శనివారం బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

సమాచారం అందుకున్న గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున గంగుల కమలాకర్ ఇంటి వద్దకు చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల జెండాలు చేత బూని నిరసనకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గంగుల కమలాకర్ తో పాటు బిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన బిఆర్ఎస్ నాయకులను పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎక్కడికక్కడ బి నాయకులను పోలీసులు అరెస్టు చేసిన నగరంలో బందు వాతావరణం కనిపించింది.

Leave a Reply