Cm-Cbn-Warned : ఇది కరెక్ట్ కాదు Andhra Prabha Top News
Cm-Cbn-Warned : ఇది కరెక్ట్ కాదు Andhra Prabha Top News
- ప్రజలకు అన్నీ తెలుసు
- ఎవరు పని చేస్తారో… చేయరో తెలుసు
- విద్వేషాలు సహించరు
- మంచి పని చేయండి
- మంచి గుర్తింపు వస్తుంది
- ఏపీలో బీఆర్ఎస్ వచ్చింది
- ఇప్పువు ఇలా మాట్లాడితే ఎలా
- పవన్ కళ్యాణ్ పై విమర్శలు తగవు
- ఏపీ సీఎం చంద్రబాబు హితవు
( ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్)
Cm-Cbn-Warned : అభివృద్ధిలో, ప్రజా సేవలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తే.. ఎంతోకాలం మనుగడ సాగించలేరని ఆతెలంగాణ రాజకీయ పార్టీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హితవు పలికారు. ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై
వివిధ రాజకీయ పార్టీల నేతల విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు తీవంగా స్పందించారు. ఏపీలో మీడియాతో ఆయన బుదవారం మాట్లాడుతూ, తెలంగాణలో పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు మంచి విధానం కాదు.
ఇలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించకూడదు.
విభజన జరిగి 12 ఏళ్లు అయ్యింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. తెలంగాణలోని కొందరు నాయకులు ఇప్పుడు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టలేరు. ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. తెలంగాణ లోని కొందరు నాయకులు అనవసర అంశాలు మాట్లాడుతున్నారు, అని ఏపీ సీఎం సీబీఎన్ సీరియస్ అయ్యారు.
నేను తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసి వచ్చాను. తమిళనాడుకు కర్నాటక సహా ఆలిండియా నేత లు వచ్చారు. కర్నాటక నుంచి డీకే శివకుమార్ కూడా వచ్చారు. వీరిని ఎవ్వరూ విమర్శించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ నేషనల్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టారు. విస్తరిస్తాం అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇది కరెక్ట్ కాదు. అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో తెలుగువాళ్లు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో మన వాళ్లు పదవులు చేపడుతున్నారు. అక్కడ ఉండే రాజ్యాంగం ప్రకారం పని చేస్తున్నారు. ఎక్కడున్నా.. మంచి చేసే నాచకులకే జనం పట్టం కడతారు, గుర్తుంచుకోవాలి, అని సీబీఎన్ హితవు పలికారు.
ALSO READ : Pawan-Strong-Warning ఇవి తాటాకు చప్పుళ్లు Andhra Prabha Top News
