- 16 మంది విదేశీయుల బహిష్కరణ
దేశ రాజధాని నగరం ఢిల్లిలో అక్రమంగా మకాం వేసిన విదేశీయులను భారత ప్రభుత్వం వెనక్కి పంపింది. వీసా గడువు ముగిసినప్పటికీ ఇక్కడే ఉంటున్న 16 మందిని అధికారులు గుర్తించారు. ద్వారకా ప్రాంతంలో మకాం వేసిన వీరిలో ఐదుగురుని బంగ్లాదేశ్ పౌరులుగా గుర్తించింది.
తొమ్మిది మంది నైజీరియన్లు, గినియా, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. వీరిని డిటెన్షన్ కేంద్రాలకు తరలించి, అక్కడి నుంచి స్వదేశాలకు పంపించినట్లు పేర్కొంది. ఇందులో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఉండగా, వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.