- తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు
హైదరాబాద్,ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలతో పీజీ మెడికల్ సీట్లలో లబ్ధి పొందలేరని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం పీజీ మెడికల్ సీట్లలో రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌లపై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు తెలంగాణ పీజీ మెడికల్ సీట్లలో చెల్లుబాటు కావని తీర్పు వెల్లడించింది. తెలంగాణలో జారీ అయిన కులధ్రువీకరణ పత్రాలు పొందిన వారే రిజర్వేషన్‌కు అర్హులని స్పష్టం చేసింది.